SHREYAS: శ్రేయస్ అయ్యర్‌పై వేటు వెనుక కుట్ర

ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ను పక్కనపెట్టడం వెనుక క్రికెటేతర కారణాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయం తనకు చాలా వింతగా అనిపిస్తోందని, తెరవెనుక ఏదో జరుగుతోందని వ్యాఖ్యానించాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడం వింతగా అనిపించిందన్నాడు. అతని వేటు వెనుక క్రికెటేతర కారణాలు ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశాడు. తెరవెనుక ఏదో కుట్ర జరుగుతోందన్నాడు. ఎక్స్ వేదికగా అభిమానులతో జరిపిన ఇంటరాక్షన్‌లో డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నిజాయితీగా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్‌ను తప్పించడం వెనుక ఉన్న కారణాలు నాకు కూడా తెలియదు. కేవలం ఊహిస్తున్నాను. శ్రేయస్ అయ్యర్ వంటి నాణ్యమైన ఆటగాడు, ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉన్న ప్లేయర్‌ను పక్కనపెట్టడం నాకు వింతగా అనిపించింది. బహుషా ఎక్కువ మంది నాయకులు ఉన్నారని పక్కన పెట్టి ఉండొచ్చు. కొన్నిసార్లు ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఎంపిక సంక్లిష్టంగా ఉన్నప్పుడు.. జట్టు వాతావరణానికి ఎవరు ఎక్కువ మేలు చేస్తారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు." అని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
సంక్లిష్టత వల్ల కావచ్చు
"కొన్నిసార్లు ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఎంపిక సంక్లిష్టంగా ఉన్నప్పుడు, జట్టు వాతావరణానికి ఎవరు ఎక్కువ మేలు చేస్తారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. జట్టులో ఉత్సాహాన్ని నింపే ఆటగాడా లేక నీరుగార్చేవాడా అని చూస్తారు. బహుశా అలాంటి కారణమేదైనా ఉందేమో!" అని అన్నాడు. అంతేకాకుండా, "జట్టులో ఇప్పటికే నాయకులు ఎక్కువయ్యారా? ఎక్కువ మంది కెప్టెన్లు ఉండటం సమస్యగా మారిందా?" అని కూడా ఆయన ప్రశ్నించాడు. ఏబీడీ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
మండిపడుతున్న మాజీలు
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. 'తాజాగా ఆసియా కప్ కోసం సెలక్టర్లు చేసిన పని లాజిక్కు అందడం లేదు. టెస్ట్ మ్యాచ్‌లో ప్రదర్శనను బట్టి టీ-20లకు ఓ ఆటగాడిని ఎలా ఎంపిక చేస్తారో అర్థం కావడం లేదు. టెస్ట్ మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శనకు టీ-20ల్లో లభించిన బహుమతిగా దీనిని అర్థం చేసుకోవాలా. దీని వెనుకున్న లాజిక్ నాకు అందడం లేదు. చాలా సంవత్సరాలుగా భారత సెలక్టర్లు ఈ విధానాన్నే అవలంభిస్తున్నారు' అని సంజయ్ విమర్శించాడు. మరికొందరు మాజీలు కూడా అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ 2025 సీజన్లో 17 మ్యాచుల్లో 50.33 యావరేజ్, 175 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు చేశాడు. అలాగే తాను సారథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com