SHREYAS: "జట్టులో చోటు లేకపోతే ఒళ్లు మండుతది"

SHREYAS: జట్టులో చోటు లేకపోతే ఒళ్లు మండుతది
X

తుది జట్టు­లో ఆడే అర్హత ఉండి కూడా టీ­మ్‌­లో అవ­కా­శం దక్క­క­పో­తే ఏ ఆట­గా­డై­నా అస­హ­నా­ని­కి గు­ర­వు­తా­డ­ని టీ­మిం­డి­యా వె­ట­ర­న్ బ్యా­ట­ర్ శ్రే­య­స్ అయ్య­ర్ అన్నా­డు. ఇలాం­టి సమ­యా­ల్లో వచ్చిన ప్ర­తీ అవ­కా­శా­న్ని సద్వి­ని­యో­గం చే­సు­కో­వా­ల­ని అభి­ప్రా­య­ప­డ్డా­డు. ఆసి­యా కప్ 2025 కోసం ఎం­పిక చే­సిన భారత జట్టు­లో శ్రే­య­స్ అయ్య­ర్‌­కు చోటు దక్క­లే­దు. దీ­ని­పై తొ­లి­సా­రి అయ్య­ర్ స్పం­దిం­చా­డు. తన వే­టు­పై మౌ­నం­గా ఉన్న శ్రే­య­స్ అయ్య­ర్.. తా­జా­గా ఓ పా­డ్‌­కా­స్ట్‌­లో స్పం­దిం­చా­డు. సె­లె­క్ట­ర్ల­పై తన అస­హ­నా­న్ని వె­ళ్ల­గ­క్కా­డు. తుది జట్టు­లో ఆడే అర్హత ఉండి కూడా అవ­కా­శం ఇవ్వ­క­పో­తే ఏ ఆట­గా­డి­కై­నా మం­డు­త­ద­ని తె­లి­పా­డు. "తుది జట్టు­లో ఆడే అర్హత ఉన్నా.. ఎం­పిక చే­య­క­పో­తే అస­హ­నం కలు­గు­తుం­ది. కానీ అదే సమ­యం­లో వచ్చిన అవ­కా­శా­న్ని సద్వి­ని­యో­గం చే­సు­కో­వా­లి. ని­ల­క­డ­గా రా­ణి­స్తూ జట్టు వి­జ­యా­ని­కి కృషి చే­యా­లి. మన పని­ని నై­తి­క­త­తో చే­స్తూ వె­ళ్లా­లి. ఎవరో చూ­స్తు­న్నా­ర­ని కా­కుం­డా.. ని­బ­ద్ధ­త­తో పని చే­సు­కుం­టూ ముం­దు­కు సా­గా­లి."అని అయ్య­ర్ చె­ప్పు­కొ­చ్చా­డు. భా­ర­త్ తర­ఫున వన్డే­ల్లో అత్యు­త్తమ ప్ర­ద­ర్శన కన­బ­ర్చి­నా.. ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ 2025లో భారత వి­జ­యం­లో కీలక పా­త్ర పో­షిం­చి­నా సె­లె­క్ట­ర్లు అయ్య­ర్‌­ను పట్టిం­చు­కో­లే­దు.

Tags

Next Story