Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు వచ్చిన శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు వచ్చిన శ్రేయస్ అయ్యర్
X
అనుకున్న దానికంటే పెద్ద గాయం.. అయ్యర్‌కు పక్కటెముకల గాయం.. గాయంతో అంతర్గత రక్తస్రావం

టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో గాయపడి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నా, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. అంతర్గత రక్తస్రావం కారణంగా ఐసీయూలో ఉంచి, ఇప్పుడు సాధారణ వార్డుకు మార్చారు. పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. సిడ్నీలోనే ఉన్న అయ్యర్‌ను భారత్‌కు ఎప్పడు తీసుకొస్తారు అనేది స్పష్టత లేదు. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు హాజరయ్యేది కూడా అనుమానమే. అయ్య­ర్‌­కు అను­కు­న్న­దా­ని­కం­టే పె­ద్ద గా­య­మే అయ్యిం­ది. పక్క­టె­ము­కల గాయం కా­ర­ణం­గా అం­త­ర్గత రక్త­స్రా­వం కా­వ­డం­తో రెం­డు రో­జు­లు అత­డి­కి ఆసు­ప­త్రి­లో ఐసీ­యూ­లో లో చి­కి­త్స అం­దిం­చా­రు. ప్ర­స్తు­తం అతడి ఆరో­గ్య పరి­స్థి­తి ని­ల­క­డ­గా ఉంది. ఆస్ట్రే­లి­యా­తో మూడో వన్డే సం­ద­ర్భం­గా క్యా­చ్‌ అం­దు­కు­నే క్ర­మం­లో శ్రే­య­స్‌ తీ­వ్రం­గా గా­య­ప­డ్డ సం­గ­తి తె­లి­సిం­దే. ముం­దు అను­కు­న్న­ట్లు మూడు వా­రా­లు కాక, మరింత కాలం అతడు ఆటకు దూరం కా­వ­చ్చు. టీ­మిం­డి­యా వైస్ కె­ప్టె­న్ శ్రే­యా­స్ అయ్యా­ర్ ఆస్ట్రే­లి­యా­తో జరి­గిన మూడో వన్డే­లో క్యా­చ్ పట్టే­ట­పు­డు తీ­వ్రం­గా గా­య­ప­డిన సం­గ­తి తె­లి­సిం­దే. పక్క­టె­ముక గాయం కా­ర­ణం­గా వెం­ట­నే గ్రౌం­డ్ వీ­డిన శ్రే­యా­స్ డ్రె­స్సిం­గ్ రూ­మ్‌­కు తి­రి­గి వచ్చిన కొ­ద్ది­సే­ప­టి­కే సి­డ్నీ­లో­ని ఆస్ప­త్రి­లో చే­ర్చా­రు. వై­ద్య పరీ­క్ష­ల్లో శ్రే­యా­స్ కు అం­త­ర్గ­తం­గా రక్త­స్రా­వం అయి­న­ట్లు గు­ర్తిం­చిన డా­క్ట­ర్లు అత­డి­కి ఇం­టె­న్సి­వ్ కేర్ యూ­ని­ట్ (ఐసీ­యూ)చి­కి­త్స అం­ది­స్తు­న్నా­రు. శ్రే­యా­స్ రెం­డు రో­జు­లు­గా ఐసీ­యూ­లో ఉన్నా­డు. రా­బో­యే 48 గం­ట­ల్లో రక్త­స్రా­వం తగ్గ­క­పో­తే.. అత­డి­కి వారం రో­జుల వరకు రె­స్ట్ అవ­స­ర­మం ఉం­టుం­ద­ని డా­క్ట­ర్లు సూ­చిం­చా­రు.

స్పృహ తప్పడంతో..

గా­యం­తో మై­దా­నా­న్ని వీ­డాక డ్రె­స్సిం­గ్‌­రూ­మ్‌­లో శ్రే­య­స్‌ స్పృహ తప్పి పడి­పో­యి­న­ట్లు తె­లు­స్తోం­ది. వెం­ట­నే అత­ణ్ని ఆసు­ప­త్రి­లో చే­ర్చ­గా.. ప్లీ­హా­ని­కి గా­య­మై­న­ట్లు స్కా­న్స్‌­తో తే­లిం­ది. క్యా­చ్‌ అం­దు­కు­నే క్ర­మం­లో అతడు బలం­గా నే­ల­పై పడ­టం­తో తీ­వ్ర­మైన గా­య­మైం­ది. ‘‘శ్రే­య­స్‌­కు పక్క­టె­ము­కల ది­గువ భా­గం­లో గా­య­మైం­ది. తదు­ప­రి పరీ­క్షల కోసం అత­ణ్ని ఆసు­ప­త్రి­కి తీ­సు­కె­ళ్లాం. అతడి ప్లీ­హా­ని­కి చీ­లిక వచ్చి­న­ట్లు స్కా­న్స్‌­లో తే­లిం­ది’’ అని బీ­సీ­సీఐ ఓ ప్ర­క­ట­న­లో తె­లి­పిం­ది. ‘‘బీ­సీ­సీఐ వై­ద్య సి­బ్బం­ది.. సి­డ్నీ, భా­ర­త్‌­లో స్పె­ష­లి­స్ట్‌­ల­ను సం­ప్ర­ది­స్తూ శ్రే­య­స్‌ చి­కి­త్స­ను పర్య­వే­క్షి­స్తోం­ది. భారత జట్టు వై­ద్యు­డు శ్రే­య­స్‌­తో పాటు సి­డ్నీ­లో­నే ఉం­టా­డు’’ అని చె­ప్పిం­ది. 30 ఏళ్ల శ్రే­య­స్‌ ఏడు రో­జుల వరకు ఆసు­ప­త్రి­లో పరి­శీ­ల­న­లో ఉం­డొ­చ్చు.

ఆలస్యం అయ్యుంటే..?

శ్రే­యా­స్‌ గాయం తీ­వ్ర­త­ను సరి­గ్గా అం­చ­నా వే­సిన బీ­సీ­సీఐ వై­ద్య బృం­దం అత­డి­ని పె­ను­ప్ర­మా­దం నుం­చి తప్పిం­చిం­ది. లే­కుం­టే పరి­స్థి­తి వి­ష­మం­గా మా­రే­ది. మై­దా­నం నుం­చి పె­వి­లి­య­న్‌­కు రా­గా­నే అయ్య­ర్‌ గా­యా­న్ని మె­డి­క­ల్‌ సి­బ్బం­ది, ఫి­జి­యో పరి­శీ­లిం­చా­రు. అం­త­లో­నే అతను స్పృహ కో­ల్పో­వ­డం­తో ఏ మా­త్రం ఆల­స్యం చే­య­కుం­డా ఆస్ప­త్రి­కి తర­లిం­చా­రు. లే­ని­ప­క్షం­లో క్రి­కె­ట­ర్‌ ప్రా­ణాల మీ­ది­కి వచ్చి­వుం­డే­ద­ని బో­ర్డు వర్గా­లు పే­ర్కొ­న్నా­యి. రక్త­స్రా­వం ఆగ­క­పో­తే ఇన్‌­ఫె­క్ష­న్‌ ప్ర­మా­దం ఉం­టుం­ది కా­బ­ట్టి ఐసీ­యూ­లో­నే రెం­డు రో­జుల పాటు ఉం­చా­రు. ప్ర­స్తు­తం వే­గం­గా కో­లు­కుం­టు­న్న శ్రే­యా్‌­స­కు అం­డ­గా సి­డ్నీ­లో­ని అతడి స్నే­హి­తు­లు ఆస్ప­త్రి­లో­నే ఉన్నా­రు. అలా­గే తల్లి­దం­డ్రు­లు సైతం వీసా ప్ర­క్రియ పూ­ర్తి­కా­గా­నే ఆస్ర్టే­లి­యా­కు పయనం కా­ను­న్నా­రు. పూ­ర్తి­గా కో­లు­కు­న్న తర్వా­తే అయ్య­ర్‌­ను భా­ర­త్‌­కు పం­పా­ల­నే ఆలో­చ­న­లో బో­ర్డు ఉంది. వన్డే జట్టు­లో మా­త్ర­మే ఉన్న అయ్య­ర్‌ బరి­లో­కి ఎప్పు­డు ది­గు­తా­డ­నే సం­దే­హా­లు నె­ల­కొ­న్నా­యి. శ్రే­యా­స్‌­కు మూడు వా­రాల వి­శ్రాం­తి అవ­స­ర­మని భా­విం­చా­రు.

Tags

Next Story