SHREYAS: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్స్

SHREYAS: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్స్
X
బీసీసీఐ దీర్ఘకాలిక ఆలోచనలో ఉన్నట్లు వార్తలు.. ఆసియా కప్‌నకు ఎంపిక కాని శ్రేయస్స్ అయ్యర్... అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు... వన్డే కెప్టెన్సీ ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టే యోచన

ఆసి­యా కప్ 2025 టీ­మిం­డి­యా జట్టు ఎం­పి­క­లో శ్రే­యా­స్ అయ్య­ర్‌­కు చోటు దక్క­క­పో­వ­డం­పై వి­మ­ర్శ­లు వె­ల్లు­వె­త్తు­తు­న్నా­యి. సూ­ప­ర్ ఫా­మ్‌­లో ఉన్న­ప్ప­టి­కీ అత­న్ని ఎం­దు­కు ఎం­పిక చే­య­లే­దో ఎవ­రి­కీ అర్థం కా­వ­డం లేదు. ఈ నే­ప­థ్యం­లో బీ­సీ­సీఐ కీలక ని­ర్ణ­యం తీ­సు­కో­ను­న్న­ట్లు వా­ర్త­లు వస్తు­న్నా­యి. శ్రే­య­స్స్ అయ్య­ర్‌­కు వన్డే సా­ర­ధ్య బా­ధ్య­త­లు అప్ప­గిం­చా­ల­ని బీ­సీ­సీఐ, అజి­త్ అగా­ర్క­ర్ నే­తృ­త్వం­లో­ని సె­లె­క్ష­న్ కమి­టీ భా­వి­స్తు­న్న­ట్లు వా­ర్త­లు వస్తు­న్నా­యి. 50 ఓవ­ర్ల ఫా­ర్మా­ట్ కు రో­హి­త్ శర్మ కె­ప్టె­న్ గా కొ­న­సా­గు­తు­న్న­ప్ప­టి­కీ ఫ్యూ­చ­ర్ ను దృ­ష్టి­లో పె­ట్టు­కొ­ని హిట్ మ్యా­న్ స్థా­నం­లో వే­రొ­క­రి­కి సా­ర­ధ్య బా­ధ్య­త­లు అప్ప­గిం­చా­ల­ని బీ­సీ­సీఐ చూ­స్తు­న్న­ట్టు తె­లు­స్తోం­ది. అదే జరి­గి­తే వన్డే వైస్ కె­ప్టె­న్ గా ఉం­టు­న్న శు­భ్‌­మ­న్ గి­ల్‌­కు కె­ప్టె­న్సీ దక్కా­లి. అయి­తే ఇక్క­డే బీ­సీ­సీఐ మరో­లా ఆలో­చి­స్తోం­ద­ని తె­లు­సోం­ది. తాజా ని­వే­ది­కల ప్ర­కా­రం వన్డే పగ్గా­లు మి­డి­ల్ ఆర్డ­ర్ బ్యా­ట­ర్ శ్రే­య­స్ అయ్య­ర్ కు అప్ప­జె­ప్పా­ల­ని బీ­సీ­సీఐ భా­వి­స్తు­న్న­ట్టు సమా­చా­రం.

సాధ్యం కాకపోవడంతోనే...

ని­న్న­టి­వ­ర­కు శు­భ­మా­న్ గిల్ ఆల్ ఫా­ర్మా­ట్ కె­ప్టె­న్ గా బా­ధ్య­త­లు ఇవ్వా­ల­ని బీ­సీ­సీఐ చూ­స్తు­న్న­ట్టు సమా­చా­రం. ఆసి­యా కప్ కు గిల్ ను టీ20 వైస్ కె­ప్టె­న్ గా ప్ర­క­టిం­చి బీ­సీ­సీఐ పరో­క్షం­గా క్లా­రి­టీ ఇచ్చిం­ది. మూడు ఫా­ర్మా­ట్ లలో గిల్ కు బా­ధ్య­త­లు అప్ప­గి­స్తే పని­భా­రం ఎక్కువ అవు­తుం­ద­ని బీ­సీ­సీఐ భా­వి­స్తు­న్న­ట్టు సమా­చా­రం. ప్ర­స్తుత క్రి­కె­ట్ క్యా­లెం­డ­ర్ ప్ర­కా­రం అన్ని ఫా­ర్మా­ట్ల­కు ఒకే ఆట­గా­డి­ని కె­ప్టె­న్‌­గా చే­య­డం సా­ధ్యం కా­ద­ని బీ­సీ­సీఐ వర్గా­లు వి­వ­రిం­చా­యి. ఏడా­ది పొ­డ­వు­నా టో­ర్న­మెం­ట్లు, టూర్ లు ఉం­డ­డం­తో మూడు ఫా­ర్మా­ట్ల­కు ఒక­రి­నే కె­ప్టె­న్ గా ని­య­మిం­చ­డం అత­ని­కి శక్తి­కి మిం­చిన పని అవు­తుం­ద­ని బో­ర్డు భా­వి­స్తోం­ది. ఆస్ట్రే­లి­యా­తో అక్టో­బ­‌­ర్‌­లో జ‌­రి­గే వ‌­న్డే సి­రీ­స్‌­ను వి­రా­ట్ కో­హ్లీ, రో­హి­త్ శ‌­ర్మ­కు ఫే­ర్‌­వె­ల్ సి­రీ­స్ అయ్యే అవ­‌­కా­శా­లు ఉన్నా­యి.

2027 వరకూ రోహితేనా..?

ప్ర­స్తు­తం భారత టె­స్టు జట్టు­కు సా­ర­థి­గా శు­భ్‌­మ­న్‌ గిల్ ఉన్నా­డు. టీ20లకు సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్.. వన్డే­ల­కు రో­హి­త్ శర్మ నా­య­క­త్వ బా­ధ్య­త­ల­ను ని­ర్వ­ర్తి­స్తు­న్న సం­గ­తి తె­లి­సిం­దే. ఇప్పు­డు గి­ల్‌­ను పొ­ట్టి ఫా­ర్మా­ట్‌­కు వై­స్‌ కె­ప్టె­న్‌­గా చే­య­డం­తో భవి­ష్య­త్తు­లో అత­డి­కే సా­ర­థ్యం అప్ప­గి­స్తా­ర­ని ఖరా­రు అయి­పో­యిం­ది. ఇక రో­హి­త్ శర్మ వచ్చే వన్డే ప్ర­పంచ కప్‌ వరకూ ఆడా­ల­నే లక్ష్యం­తో ఉన్నా­డు. అయి­తే, రో­హి­త్‌­ను వన్డే సా­ర­థ్యం నుం­చి తప్పిం­చి శ్రే­య­స్‌­ను వర­ల్డ్ కప్‌ 2027 వరకూ ని­య­మి­స్తా­ర­నే ప్ర­చా­రం జో­రు­గా సా­గు­తోం­ది. ఆ తర్వాత కూడా గి­ల్‌­ను ఏకైక సా­ర­థి­గా చే­య­క­పో­వ­చ్చ­ని క్రి­కె­ట్ వర్గా­లు అం­చ­నా వే­స్తు­న్నా­యి. వన్డే ప్ర­పం­చ­క­ప్‌ నా­టి­కి అత­డి­కి 40+ అవు­తా­యి. గి­ల్‌­కే బా­ధ్య­త­లు అప్ప­గిం­చా­ల­ని తొ­లుత మే­నే­జ్‌­మెం­ట్ భా­విం­చిం­ది. కానీ, వర్క్‌­లో­డ్‌ కా­ర­ణం­గా అతడి ప్ర­ద­ర్శ­న­పై ప్ర­భా­వం పడు­తుం­దే­మో­న­న్న ఆం­దో­ళన వ్య­క్త­మైం­ది. దీం­తో వన్డే­ల­కు రో­హి­త్‌ బదు­లు శ్రే­య­స్‌­ను సా­ర­థి­గా ని­య­మి­స్తే బా­గుం­టుం­ద­నే వా­ద­నా ఉంది. ఆసి­యా కప్‌ తర్వాత సె­ల­క్ష­న్ కమి­టీ సమా­వే­శ­మై రో­హి­త్, వి­రా­ట్ భవి­త­వ్యం­పై చర్చి­స్తా­ర­ని.. శ్రే­య­స్‌­ను కె­ప్టె­న్‌­గా చే­స్తా­ర­న్న కథ­నా­లు వచ్చా­యి.

Tags

Next Story