SHREYAS: పాపం.. కెప్టెన్సీ కూడా ఉత్తుదేనంట..!

ఎంత రాణించిన, ఎంత శ్రమించిన టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు అదృష్టం దక్కడం లేదు. టెస్ట్ టీంలోనే చోటు దక్కకపోవడం అభిమానులను షాక్‌కు గురి చేస్తే.. ఆసియా కప్ 2025 టీంలో దక్కపోవడం నిపుణులనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా పక్కనా పెడితే వన్డే జట్టు పగ్గాలు అయ్యర్‌కేనని మీడియా వర్గాలు కోడై కూశాయి. దీంతో మాజీలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. వాస్తవానికి అయ్యర్‌కు మించిన సమర్థుడు టీంలో ఎవరు లేరు కూడా. కట్ చేస్తే.. బీసీసీఐ మరోసారి బిగ్ షాకిచ్చింది.
ఖండించిన బీసీసీఐ
ఇండియా వన్డే టీం కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించే అవకాశం ఉందని వస్తున్న వార్తలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఖండించారు. అవన్నీ ఊహాగానాలే అని, కెప్టెన్సీ విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ తర్వాత వన్డేలకు అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించే రేసులో ఉన్నాడంటూ నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. రోహిత్ పై కెప్టెన్సీ భారాన్ని తగ్గించాలని బీసీసీఐ భావిస్తోందని కూడా పేర్కొన్నాయి. ‘ఈ విషయాన్ని నేను ఇప్పుడే వింటున్నా. వన్డే కెప్టెన్సీ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు’ అని స్పష్టం చేశారు. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత, క్రికెట్ వర్గాల్లో ఊహించని చర్చ మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరో మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కూడా తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ విషయంపై మాట్లాడారు. శ్రేయస్ పేరు రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చోప్రా అన్నారు. “రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో కూడా శ్రేయస్ పేరు లేదు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. తుది జట్టులో అతన్ని తీసుకోకపోవడం అర్థం చేసుకోదగినదే. ఎందుకంటే శివమ్ దూబే, రింకూ సింగ్ వంటి లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు అవకాశం ఇచ్చారు. అయితే, రిజర్వ్ ప్లేయర్లలో ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. శ్రేయస్‌కు కూడా ఒక స్థానం కల్పించవచ్చు కదా. అతని పేరు అందులో కూడా లేకపోవడం సరైన సంకేతం కాదు. అతని టీ20 కెరీర్ భవిష్యత్తుపై స్పష్టత లేదు” అని చోప్రా వ్యాఖ్యానించారు.
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిబంధనల ప్రకారం వాస్తవానికి 17 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించేందుకు అవకాశముంది. టోర్నీలో పోటీపడే జట్లు 17 మంది ఎంపిక చేసుకోవచ్చని నిబంధనలు ఉన్నా..బీసీసీఐ అందుకు భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో 17 మంది ప్లేయర్లకు తోడు 8 మంది సహాయక సిబ్బందితో మొత్తంగా 25 మంది ఉండవచ్చని ఏసీసీ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఇదే టోర్నీలో పోటీపడుతున్న పాకిస్థాన్, హాంకాంగ్ 17 మందితో జట్టును ప్రకటించగా, 15 మందిని ఎంపిక చేసిన బీసీసీఐ కనీసం స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాలోనూ అయ్యర్‌కు అవకాశమివ్వకపోవడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com