Shubhman Gill: గిల్ ఖాతాలో అరుదైన రికార్డ్..

Shubhman Gill: గిల్ ఖాతాలో అరుదైన రికార్డ్..
26 వన్డే ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజాం పేరిట చాలా రోజులుగా ఉన్న రికార్డును అధిగమించాడు. బాబర్ 26 ఇన్నింగ్స్‌ల తర్వాత 1322 పరుగులు చేశాడు.

Shubhman Gill: టెస్ట్ సిరీస్‌లో తన రెగ్యులర్ స్థానమైన ఓపెనింగ్ నుంచి 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారత ఆటగాడు శుభ్ మన్ గిల్ విఫలమయ్యాడు. అయితే వన్డే సిరీస్‌లో బాగానే రాణిస్తున్నాడు. విండీస్‌తో జరుగుతున్న 2వ వన్డేలో మరో ఓపెనర్‌ ఇషాన్ కిషన్‌తో కలిసి 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. విండీస్‌తో ఆడిన ఇన్సింగ్స్ గిల్ కెరీర్‌లో 26వ ఇన్నింగ్స్‌. ఆ మ్యాచ్‌లో 34 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో 1352 పరుగులు నమోదు చేశాడు. మ్యాచ్ ఓడినప్పటికీ గిల్ ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. 26 వన్డే ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజాం పేరిట చాలా రోజులుగా ఉన్న రికార్డును అధిగమించాడు. బాబర్ 26 ఇన్నింగ్స్‌ల తర్వాత 1322 పరుగులు చేశాడు.

ఈ జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన జోనాథన్ ట్రాట్ (1303 పరుగులు), పాకిస్థాన్‌కు చెందిన ఫఖర్ జమాన్ (1275 పరుగులు), దక్షిణాఫ్రికాకు చెందిన రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ (1267 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

2వ వన్డేలో ఓపెనిర్లిద్దరూ రాణించినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యంతో 181 పరుగులకే ఆలౌటయింది. విండీస్‌ జట్టు 36.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 182 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. 3వ వన్డే ఆగస్ట్ 1న జరగనుంది.


Tags

Read MoreRead Less
Next Story