Team India: రేపటి నుంచి న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..

Team India:  రేపటి నుంచి న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..
X
టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్లు గిల్‌, పంత్‌ ఫిట్‌

స్వదేశంలో న్యూజిలాండ్‌తో గురువారం నుంచి పూణె వేదికగా జరగాల్సి ఉన్న రెండో టెస్టుకు భారత స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో పాటు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఫిట్‌గా ఉన్నారని టీమ్‌ఇండియా అసిస్టెంట్‌ కోచ్‌ రియాన్‌ టెన్‌ డస్కటె అన్నాడు. తొలి టెస్టుకు ముందు గిల్‌ మెడ కండరాలు పట్టేయగా అదే మ్యాచ్‌లో కీపింగ్‌ చేస్తూ పంత్‌ మోకాలికి గాయమైంది. డస్కటె మాట్లాడుతూ.. ‘జట్టులో అందరూ ఫిట్‌గా ఉన్నారు. గిల్‌ గత వారం బ్యాటింగ్‌ చేశాడు. కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ రెండో టెస్టు నాటికి అతడు పూర్తిస్థాయిలో సిద్ధమవుతాడు. పంత్‌ ఫిట్‌గా ఉన్నాడు’ అని తెలిపాడు. గిల్‌ రాకతో మిడిలార్డర్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌, రాహుల్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో పిచ్‌, పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టును ఎంపికచేస్తామని డస్కటె తెలిపాడు.

ఢాకా: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 106 పరుగులకే ఆలౌట్‌ చేసిన సఫారీలు బ్యాట్‌తోనూ మెరిశారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కైల్‌ వీరేన్‌ (114) శతకంతో విజృంభించగా వియాన్‌ మల్డర్‌ (54) హాఫ్‌ సెంచరీ చేశాడు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటై 202 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 27.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 101 రన్స్‌ చేసింది. బంగ్లాదేశ్‌ ఇంకా 101 పరుగుల వెనుకంజలో ఉంది. మహ్మదుల్‌ హసన్‌ (38 బ్యాటింగ్‌), ముష్ఫీకర్‌ రహీం (31 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

Tags

Next Story