GILL: ఐసీయూలో శుభ్‌మన్ గిల్..!

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో మైదానం వీడాడు. వాషింగ్టన్ సుందర్(29) ఔటైన వెంటనే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్ గిల్ మూడు బంతులకే పెవిలియన్ బాట పట్టాడు. తొలి రెండు బంతులను డాట్ చేసిన గిల్.. మూడో బంతిని స్లాగ్ స్వీప్ షాట్‌తో బ్యాక్వార్డ్ స్క్వేర్ దిశగా బౌండరీ బాదాడు. అయితే ఈ షాట్ ఆడిన అనంతరం అతను మెడ నొప్పితో బాధపడ్డాడు. ఫిజియోలు వచ్చి మాట్లాడగా.. బ్యాటింగ్ చేయలేనని చెప్పాడు. దాంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. అయితే శుభ్‌మన్ గిల్‌కు నిద్రలో మెడ పట్టేసినట్లు తెలుస్తుంది. అయినా జట్టు కోసం అతను బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ తన వల్ల కాకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా బరిలోకి దిగాడు. మెడ నొప్పి కాస్త తగ్గిన తర్వాత శుభ్‌మన్ గిల్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగే ఛాన్స్ ఉంది. శుభ్‌మన్ గిల్ వెనుదిరగడంతో రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
మ్యాచ్ అనంతరం స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. “ప్రస్తుతం గిల్ మెడ బిగుసుకుపోయింది. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నిన్న రాత్రి గిల్ సరిగ్గా నిద్ర పోలేదు. అందువల్ల ఇలా జరిగి ఉండవచ్చు..” అని భారత్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

