SMIRTHI-PALASH: మంధాన-పలాశ్ పెళ్లి రద్దు.. ఆగని ఊహాగానాలు

SMIRTHI-PALASH: మంధాన-పలాశ్ పెళ్లి రద్దు.. ఆగని ఊహాగానాలు
X
సాధించాల్సిన వాటిపై దృష్టి పెట్టండి: స్మృతీ మంధాన..

టీ­మిం­డి­యా మహి­ళా స్టా­ర్ క్రి­కె­ట­ర్ స్మృ­తి మం­ధాన వి­వా­హం రద్దైన వి­ష­యం తె­లి­సిం­దే. సం­గీత దర్శ­కు­డు పలా­ష్ ము­చ్చ­ల్‌­ను నవం­బ­ర్ 23న స్మృ­తి వి­వా­హం చే­సు­కో­వా­ల్సి ఉం­డ­గా.. ఊహిం­చ­ని రీ­తి­లో పె­ళ్లి­కి కొ­న్ని గంటల ముం­దు వా­యి­దా పడిం­ది. స్మృ­తి తం­డ్రి శ్రీ­ని­వా­స్ ఆరో­గ్యం క్షీ­ణిం­చ­డం­తో పె­ళ్లి వా­యి­దా పడిం­ద­ని, పలా­ష్ కూడా అనా­రో­గ్యా­ని­కి గు­ర­య్యా­డ­ని, డి­సెం­బ­ర్ 7న ఇద్ద­రి వి­వా­హం జర­గ­నుం­ద­ని సో­ష­ల్ మీ­డి­యా­లో వా­ర్త­లు చక్క­ర్లు కొ­ట్టా­యి. స్మృ­తి పలా­ష్‌­తో పె­ళ్లి రద్దు చే­సు­కు­న్న­ట్లు ప్ర­క­టిం­చా­రు.

స్మృ­తి మం­ధాన తన పో­స్ట్‌­లో వి­వా­హం ఎం­దు­కు రద్దు అయిం­దో చె­ప్ప­లే­దు. స్మృ­తి, పలా­ష్ వి­వా­హం వా­యి­దా పడి­న­ప్ప­టి నుం­చి కొ­న్ని షా­కిం­గ్ వి­ష­యా­లు చక్క­ర్లు కొ­ట్టా­యి. పలా­ష్ ఓ అమ్మా­యి­తో చా­టిం­గ్ చే­సిన కొ­న్ని స్క్రీ­న్‌­షా­ట్‌­లు వై­ర­ల్ అయ్యా­యి. ఇదే పె­ళ్లి రద్దు­కు అసలు కా­ర­ణ­మ­ని న్యూ­స్ వచ్చిం­ది. తా­జా­గా మరో షా­కిం­గ్ న్యూ­స్ నె­ట్టింట వై­ర­ల్ అవు­తోం­ది. సాం­గ్లి­లో వి­వా­హా­ని­కి ముం­దు రోజు రా­త్రి పలా­ష్ ఓ మహి­ళా క్రి­కె­ట­ర్‌­కు రెడ్ హ్యాం­డె­డ్‌­గా దొ­రి­కి­పో­యా­డట. పె­ళ్లి­కి ముం­దు రోజు రా­త్రి ఫా­మ్‌­హౌ­స్‌­లో స్మృ­తి తన స్నే­హి­తు­ల­తో సర­దా­గా గడు­పు­తోం­ది. ఈ సమ­యం­లో ఓ ఊహిం­చ­ని దృ­శ్యం క్రి­కె­ట­ర్ శ్రే­యం­కా పా­టి­ల్ కంట పడిం­దట. కొ­రి­యో­గ్రా­ఫ­ర్ నం­దిక ద్వి­వే­ది­తో పలా­ష్ సన్ని­హి­తం­గా ఉం­డ­డం శ్రే­యం­కా పా­టి­ల్ చూ­శా­రట. శ్రే­యం­కా వెం­ట­నే వి­ష­యం స్మృ­తి చె­ప్పా­రట. స్మృ­తి కూడా పలా­ష్, నం­ది­క­ల­ను అస­హ్య­క­ర­మైన స్థి­తి­లో చూ­శా­రట. స్మృ­తి సో­ద­రు­డు పలా­ష్‌­ను కొ­ట్ట­గా.. గొడవ జరి­గిం­దట. ఇదం­తా జరి­గి­న­ప్పు­డు అక్కడ చాలా తక్కువ మంది మా­త్ర­మే ఉన్నా­రట. ఉదయం స్మృ­తి తం­డ్రి ఆరో­గ్యం క్షీ­ణిం­చిం­ద­ని, పె­ళ్లి వా­యి­దా పడిం­ద­ని అం­ద­రి­కి చె­ప్పా­రన్న టాక్ నడు­స్తోం­ది.

సాధించాల్సిన వాటిపై దృష్టి పెట్టండి: స్మృతీ మంధాన

భారత వైస్ కె­ప్టె­న్ స్మృ­తి మం­ధాన జరి­గిన వి­ష­యా­ల­ను మరచి పో­వ­డా­ని­కి ప్ర­య­త్ని­స్తోం­ది. ఆటపై దృ­ష్టి పె­ట్టేం­దు­కు తనని తాను సం­సి­ద్ధం చే­సు­కుం­టోం­ది. ఈ క్ర­మం­లో­నే సం­గీత స్వ­ర­క­ర్త పలా­ష్ ము­చ్చ­ల్‌­తో తన వి­వా­హం రద్దు అయిం­ద­ని ధృ­వీ­క­రిం­చిన తర్వాత ఆమె మొ­ద­టి­సా­రి మీ­డి­యా ముం­దు కని­పిం­చిం­ది. అమె­జా­న్ సం­భ­వ్ సమ్మి­ట్‌­లో మా­ట్లా­డు­తూ, 29 ఏళ్ల స్మృ­తి జీ­వి­తం­లో అను­కో­ని పరి­ణా­మా­లు సం­భ­విం­చి­న­ప్ప­టి­కీ ఆట తనను సమ­తు­ల్యం చే­స్తుం­ద­ని చె­ప్పిం­ది. జీ­వి­తం సం­క్లి­ష్టం­గా మా­రి­న­ప్పు­డు తనను తాను ని­ల­బె­ట్టు­కో­వ­డా­ని­కి క్రి­కె­ట్ ఎల్ల­ప్పు­డూ ఒక మా­ర్గా­న్ని అం­ది­స్తుం­ద­ని ఆమె అన్నా­రు.

ఏదై­నా రం­గం­లో ఎవ­రై­నా వి­జ­యం సా­ధిం­చా­రం­టే దాని వె­నుక ఎంతో కష్టం ఉం­టుం­ది. అది ఎవ­రి­కీ తె­లి­య­దు.. తె­లి­యా­ల్సిన అవ­స­రం కూడా లేదు. ఆ కష్టం పడే వా­ళ్ల­కి సం­తృ­ప్తి­ని ఇచ్చే రోజు ఒకటి ఉం­టుం­ది. దాని కోసం ఎం­త­టి శ్రమ అయి­నా చే­యా­లి. స్థి­ర­మైన కృషి మా­త్ర­మే ఫలి­తా­న్ని­స్తుం­ద­ని తె­లి­పిం­ది. "నేను ఎప్పు­డూ చాలా సా­ధా­రణ వ్య­క్తి­ని, దేని గు­రిం­చి అయి­నా ఎక్కు­వ­గా ఆలో­చిం­చ­డం ద్వా­రా నా జీ­వి­తా­న్ని క్లి­ష్ట­త­రం చే­సు­కో­ను. మీరు తె­ర­వె­నుక చాలా ఎక్కు­వ­గా పని చే­స్తే­నే, నమ్మ­కం­గా బ్యా­టిం­గ్‌­కు వె­ళ్తా­రు" అని ఆమె క్రి­కె­ట్ క్రీ­డా­కా­రు­ల­ను ఉద్దే­శిం­చి చె­ప్పిం­ది. నవం­బ­ర్ 2న నవీ ముం­బై­లో­ని డివై పా­టి­ల్ స్టే­డి­యం­లో దక్షి­ణా­ఫ్రి­కా­పై భా­ర­త­దే­శం సా­ధిం­చిన చా­రి­త్రా­త్మక వన్డే ప్ర­పంచ కప్ వి­జ­యా­న్ని మం­ధాన తి­రి­గి గు­ర్తు­చే­సు­కుం­ది. సమి­ష్టి సం­క­ల్పా­ని­కి గు­ర్తు ఆ క్ష­ణం అని అభి­వ­ర్ణిం­చిం­ది. తనకు క్రి­కె­ట్ కంటే మరే­దీ ఇష్ట­మ­ని అను­కో­వ­డం లే­ద­ని వె­ల్ల­డిం­చిం­ది.

Tags

Next Story