SMRITHI: స్మృతి మంధానకు సర్ప్రైజ్ ప్రపోజల్

భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ అయిన స్మృతి మంధాన తనకు కాబోయే భర్త నుంచి సర్ప్రైజ్ ప్రపోజల్ అందుకుంది. మంధానకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్.. ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతి మంధానకు మోకాళ్లపై నిలుచుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. తర్వాత మంధాన కూడా అతణ్ని కౌగిలించుకుంది. అనంతరం ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వీడియోను పలాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్మృతి కళ్లకి గంతలు కట్టి స్టేడియం దగ్గరికి తీసుకువచ్చిన పలాశ్.. అనంతరం మోకాళ్లపై కూర్చుని ఉంగరాన్ని అందించగా ఆశ్చర్యానికి లోనైన మంధాన వెంటనే ఆ ప్రపోజల్‌ను అంగీకరించింది. అనంతరం ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని తమ ప్రేమ బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

