WTC: ఇదీ "గద" విజయమంటే

క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఐసీసీ సిరీస్ లలో చోకర్స్ అనే అబాండాన్ని మోస్తున్న దక్షిణాఫ్రికా జట్టు అందరి నోళ్లను మూయించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఐసీసీ టోర్నీలలో తిరుగులేని కమ్మిన్స్ సేనకు పరాభవం ఎదురైంది. ఒక దిశలో దక్షిణఫ్రికా గెలవడమే కష్టం అనుకున్న దశలో క్రీజ్ లోకి వచ్చిన మార్కరమ్, బవుమా జాగ్రత్తగా సరికొత్త చరిత్రకు జాగ్రతగా పునాదులు వేశారు.
ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాదే
క్రికెట్ మక్కా 'లార్డ్స్' వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో తొలుత సౌతాఫ్రికా టాస్ గెలిచింది. కగిసో రబాడ అద్భుతమైన బౌలింగ్ కు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212 పరుగులకే కుప్పకూలింది. రబాడ 5 వికెట్లను తోడు.. యాన్సెన్ 3, కేశవ్ మహారాజ్, మార్కరమ్ ఒక్కో వికెట్ సాధించి అద్భుత సహకారం అందించారు. అయితే, సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా అంత సాఫీగా సాగలేదు. కంగారూల సారధి ప్యాట్ కమ్మిన్స్ 6 వికెట్లతో విశ్వరూపం చూపించాడు. దీంతో సఫారీలు 130 పరుగులకే కుప్పకూలింది. కమ్మిన్స్ కు తోడు స్టార్క్ 2, హేజిల్‌వుడ్ 1 వికెట్ సాధించి ఏ దశలోనూ సఫారీలను కోలుకోనివ్వలేదు. బవుమా ఔటైనా.. మార్‌క్రమ్ దాదాపు చివరి వరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికా జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మార్‌క్రమ్ (136) అద్భుత శతకం సాధించాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ చక్కటి డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో అయిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 5 వికెట్ల తేడాతో లంచ్ బ్రేక్‌కు ముందే మ్యాచ్‌ను గెలిచి, ఛాంపియన్ షిప్‌ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది.
మార్‌క్రమ్ క్లాస్ షో
రెండో ఇన్నింగ్స్ లోనూ కగిసో రబాడ చెలరేగి ఆడటంతో ఆసీస్ జట్టు 207 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల భారీ లక్ష్యం ఛేదించాల్సి వచ్చింది. లార్డ్స్ వేదికలో కమ్మిన్స్, స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్ వంటి బౌలర్ల ముందు సఫారీలు తేలిపోవడం ఖాయమని అంత భావించారు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన మార్కరమ్(136) ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకుండా క్లాసిక్ షాట్ లతో చెలరేగిపోయాడు. ఓవర్‌నైట్ బ్యాటర్ టెంబా బవుమా(134 బంతుల్లో 5 ఫోర్లతో 66) అద్భుత సహకారం అందించాడు. ట్రిస్టన్ స్టబ్స్(43 బంతుల్లో 8) నిరాశపర్చినా.. డేవిడ్ బెడింగ్‌హమ్(49 బంతుల్లో ఫోర్‌తో 21 నాటౌట్)తో కలిసి మార్క్‌రమ్(207 బంతుల్లో 14 ఫోర్లతో 136) జట్టును విజయం ముంగింట నిలబెట్టాడు. చివర్లో మార్క్‌రమ్ ఔటైనా.. వెర్రెన్నే(4 నాటౌట్)తో కలిసి బెడింగ్‌హమ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్‌వుడ్ చెరో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఐసీసీ ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో శతకం బాదిన తొలి బ్యాటర్‌గా మార్కరమ్ రికార్డు సృష్టించాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌తో పాటు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ విమర్శలు గుప్పించారు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ సరిగ్గా లేదన్నారు. అయితే ఈ పరిస్థితికి ప్యాట్ కమిన్స్ చెత్త కెప్టెన్సీ కారణమని డేల్ స్టెయిన్, మాథ్యూ హెడెన్ అన్నారు. అటాకింగ్ ఫీల్డ్ సెటప్ కాకుండా డిఫెన్సివ్ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్నాడని విమర్శించారు. 'ఫీల్డ్ సెటప్ విషయంలో ఆసీస్ తప్పిదం చేసింది. అటాకింగ్ ఫీల్డ్ సెటప్ కాకుండా డిఫెన్సివ్ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com