T20 WORLD CUP: దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు ఖాయం!

టీ 20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడిపోకుండా సూపర్ ఎయిట్‌కు చేరుకున్న ప్రొటీస్...సూపర్ ఎయిట్‌లోనూ వరుసగా రెండు విజయాలు సాధించిన సెమీస్‌లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయంలో వికెట్లు కోల్పోయి బ్రిటీష్ జట్టు పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ రెండు మ్యాచుల్లో ఒక విజయం సాధించి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్... సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి వికెట్‌కు దక్షిణాఫ్రికా ఓపెనర్లు హెండ్రిక్స్-క్వింటన్ డికాక్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు పది ఓవర్లలోనే 86 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. 29 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. 86 పరుగుల వద్ద హెండ్రిక్స్‌ను మొయిన్ అలీ అవుట్ చేశాడు.
38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 65 పరుగులు చేసిన డికాక్‌ను.. ఆర్చర్ అవుట్ చేశాడు. 92 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ రనౌట్ కావడంతో 103 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ 28 నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేయడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బ్రిటీష్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు తీసి రాణించాడు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆరంభంలో దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేశారు. ఓ దశలో ఇంగ్లాండ్ జట్టు 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ బ్రూక్-లివింగ్ స్టోన్ ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. బ్రూక్ 53 పరుగులు చేసి బ్రిటీష్ జట్టుకు విజయాన్ని అందించేలా కనిపించాడు. బ్రూక్‌కు లివింగ్ స్టోన్ 33 పరుగులు చేసి మంచి సహకారాన్ని అందించాడు. కానీ పుంజుకున్న ప్రొటీస్ బౌలర్లు బ్రూక్-లివింగ్ స్టోన్ లను అవుట్ చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు చేయాల్సి ఉండగా.... ఇంగ్లాండ్ 7 పరుగులే చేయగలిగింది. దీంతో ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
బుమ్రాపై కీలక వ్యాఖ్యుల
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు ముప్పు తిప్పలు పడుతున్నారు. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు నేలకూల్చి ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా ఏడే పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడిన్ కూడా ఉంది. అయితే బుమ్రా బౌలింగ్‌పై టీమిండియా మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో ఎవరూ బౌలింగ్ గురించి బుమ్రాకు సలహాలు ఇవ్వబోరని తెలిపాడు. ఒకవేళ బౌలింగ్ గురించి సలహాలు ఇస్తే బుమ్రా అనవసరంగా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని భావిస్తారని అక్షర్ కామెంట్స్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com