Spain soccer chief : ముద్దుకు మూల్యం

స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. తన దేశం ఫిఫా మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను తొలిసారి గెలిచిందన్న ఆనందంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ ప్రదర్శించిన అత్యుత్సాహం.. ఆయన పదవికే ఎసరు తెచ్చింది. గత నెలలో మహిళల ప్రపంచకప్ జట్టులోని క్రీడాకారిణికి అనుచితంగా ముద్దు ఇచ్చాడనే ఆరోపణలతో స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ హెడ్ లూయిస్ రూబియల్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రుబియాల్స్ రాజీనామాను ధ్రువీకరించారు.
స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీప్ క్రీడాకారిణిని ముద్దాడి.. చివరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పటికే తన పదవి నుంచి సస్పెండైన ఆయన.. ప్రస్తుతం రాజీనామాను సమర్పించారు. ఆగస్టు నెలలో సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0 తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి స్పెయిన్ ఫిఫా మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను తొలిసారి అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్ అందిస్తూ.. స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో ను చుంబించారు. ఇతర క్రీడాకారిణుల చెంపలను ముద్దాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారడంతో స్పెయిన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.
గెలుపు కన్నా ఈ ముద్దు వివాదమే ఎక్కువగా వార్తల్లో నిలవడంతో తొలిసారి చాంఫియన్‌గా నిలిచామన్న ఆనందం స్పెయిన్ మహిళా జట్టుకు లేకుండా పోయింది. క్రీడాకారిణి అంగీకారంతోనే చుంబించినట్లు లూయిస్ తెలపగా.. అందుకు తాను అంగీకరించలేదంటూ హెర్మోసో స్పందించింది. ఈ క్రమంలోనే ఆయనపై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. గత సోమవారం స్పానిష్ ప్రా సిక్యూటర్ జెన్నీ హెర్మోసో ముద్దుకు సంబంధించి లైంగిక వేధింపులు, బలవంతం చేసిన రుబియాల్స్‌పై హైకోర్టులో దావా వేశారు. ఆగస్ట్ 20వతేదీన సిడ్నీలో స్పెయిన్ వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత లూయిస్ ప్రవర్తనపై విచారణ పెండింగ్‌లో ఉంది.
రూబియాల్స్‌ను మూడు నెలల పాటు ఫుట్‌బాల్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఫీఫా నిషేధించింది. ఇక ఆదివారం అర్ధరాత్రి రూబియాలెస్ తన రాజీనామాను ప్రకటించారు. ‘ఫిఫా విధించిన సస్పెన్షన్ వేటు, నాపై నమోదైన కేసులు కారణంగా.. నేను ఈ పదవిలోకి తిరిగిరాలేనని స్పష్టమవుతోంది’ అంటూ తన రాజీనామా లేఖలో వెల్లడించారు. ఆయన 2018లో ఫెడరేషన్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పదవితో పాటు యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలనుంచి కూడా వైదొలిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com