TENNIS: ఈ సారి వింబుల్డన్ అతడిదే..!

TENNIS: ఈ సారి వింబుల్డన్ అతడిదే..!

ఈ సారి వింబుల్డన్ ట్రోఫీ గెలిచేది సెర్బియా ఆటగాడు జకోవిచ్ అని ప్రస్తుత టెన్నిస్ వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ ఆటగాడు, స్పెయిన్‌కి చెందిన 20 ఏళ్ల కార్లోస్ అల్కజార్ జోస్యం చెప్పాడు. ఆదివారం ప్రతిష్ఠాత్మకమైన క్వీన్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచి ర్యాంకింగ్‌లో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. సెర్బియన్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌ నంబర్ 1 ర్యాంక్ కోల్పోయాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో 18వ ర్యాంక్ ఆటగాడు అలెక్స్ డీ మినార్‌ను ఓడించి తన మొదటి గ్రాస్ కోర్ట్ టైటిల్ గెలిచాడు. ఫైనల్ చేరే క్రమంలో టాప్ ఆటగాళ్లైన దిమిత్రోవ్, సెబాస్టియన్ కొర్డాలను ఓడించాడు.

అయితే వచ్చే వారంలో జరగనున్న వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో అల్కాజార్ నంబర్ 1 సీడ్‌గా బరిలో దిగనున్నాడు. అయితే టైటిల్ ఫేవరేట్ మాత్రం జకోవిచే అని అన్నాడు. జకోవిచ్ ఈ సంవత్సరం ఇప్పటికే 2 టైటిళ్లను గెలిచాడు. కానీ గ్రాస్ కోర్ట్‌పై ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగనున్నాడు. వింబుల్డన్ గెలిస్తే జకోవిచ్ ఖాతాలో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరనుంది.

గత సంవత్సరం హార్డ్ కోర్ట్ గేమ్ టోర్నీ US ఓపెన్‌ గెలిచిన అల్కాజార్, క్వీన్స్ ఛాంపియన్‌షిప్ గెలిచి తాను గ్రాస్ కోర్టుపై కూడా సత్తా చాటగలడని ప్రత్యర్థులకు గట్టి సంకేతాలే పంపాడు. అయితే గత సంవత్సరం వింబుల్డన్‌లో 4వ రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఈ సారి టైటిల్ ఫేవరేట్లలో కార్లోస్ అల్కాజార్‌ కూడా ఒకరు అనడంలో సందేహం లేదు.

Tags

Read MoreRead Less
Next Story