CT2025: కివీస్‌ను స్పిన్‌తో చుట్టేస్తారా.. ?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రసవత్తర సమరానికి వేళైంది. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో.. ఫైనల్ లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించే అవకాశముంది. రెండు జట్ల స్పిన్నర్ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయమనేలా కనిపిస్తోంది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ లతో భారత్ స్పిన్ దళం బలంగా ఉంది. వీరు బౌలింగ్ లో రాణించి కివీస్ ఆటగాళ్లను కట్టడి చేస్తే.. కప్పు భారత్ దే అని నిపుణులు చెబుతున్నారు. కివీస్‌లోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వారిని టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
తుది జట్టులో మార్పు..?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా భారత్ తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అంచనా వేశాడు. 'ఈ ట్రోఫీలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్ ఎంతో బెస్ట్. దీంతో 280 నుంచి 300 పరుగుల చేయగలిగే పిచ్ గా తయారు చేయొచ్చు' అని చెప్పుకొచ్చాడు. అయితే, ఎవరిపై వేటు వేసి? ఎవరిని తీసుకోవచ్చనేది మాత్రం చెప్పలేదు.
జడేజాను తక్కువ అంచనా వేస్తున్నారు: గంభీర్
భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజాపై గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ టీం విజయంలో జడ్డూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ జడేజాను తక్కువ అంచనా వేస్తున్నారు.. భారత క్రికెట్‌కు అతను చాలా కీలకం’ అని గంభీర్ వెల్లడించారు.
రోహిత్... నిజాయతీ పరుడు
భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశంసించారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు ముందు SKY ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. 'రోహిత్ చాలా నిజాయితీపరుడు. స్వచ్ఛమైన హృదయుడు. జట్టు సభ్యులు ఎదగడానికి అవకాశం ఇస్తాడు. అతని నాయకత్వంలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నాను.' అని SKY అన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com