Sports: భారత్‌లో ఒలింపిక్ పోటీలు.. మనకూ సత్తా ఉంది: అనురాగ్ ఠాకుర్

Sports: ఒలింపిక్ వేడుకలు నిర్వహించేందుకు భారత్‌కు కూడా అన్ని వనరులూ ఉన్నాయంటూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. 2036 ఒలంపిక్స్ ను దేశంలోనే నిర్వహించాల్సిందిగా అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీని కోరనున్నట్లు అనురాగ్ తెలిపారు.
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో విశ్వక్రీడలు నిర్వహించేందుకు అన్ని వసతులూ ఉన్నాయని అనురాగ్ అన్నారు. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటూ, ప్రేక్షకులకూ ఆతిథ్యం ఇవ్వగల సత్తా మనకు ఉందని చెప్పారు.
1982లో ఆసియా క్రీడలు, 2010లో కామన్ వెల్త్ క్రీడలు నిర్వహించిన మనకు ఒలంపిక్స్ నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సమ్మర్ ఒలంపిక్స్ కు విడిది ఇచ్చే కెపాసిటీ ఉందని తెలిపారు.
ప్రస్తుతం 2032 వరకూ స్లాట్ లు అన్నీ బుక్ అయిపోయాయని తెలిపిన అనురాగ్ ఠాకుర్ 2036 నుంచి ఖాళీగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒలంపిక్స్ ను భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని హామి ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఒలంపిక్స్ కమిటికీ ఓ రోడ్ మ్యాప్ ను కూడా అందజేయబోతున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com