Sports : సానియా మీర్జాకు గ్రాండ్‌ ఫేర్‌వెల్

Sports : సానియా మీర్జాకు గ్రాండ్‌ ఫేర్‌వెల్

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాకు గ్రాండ్‌ ఫేర్‌వెల్ లభించింది. ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్‌ ఆడింది. డబుల్స్‌ మ్యాచ్‌ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరిగింది. సింగిల్స్‌లో రోహన్‌ బోపన్నతో సానియా తలపడింది. సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, అజారుద్దీన్‌ తదితరులు సానియా చివరి మ్యాచ్‌ను వీక్షించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఎల్బీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

సాయంత్రం సానియా మీర్జాకు ఓ ప్రైవేట్‌ హోటల్‌లో రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌, గాలా డిన్నర్‌ జరగనుంది. సాయంత్రం గాలా డిన్నర్‌కు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేశ్‌బాబు, ఏఆర్‌ రెహమాన్‌, సురేష్‌రైనా, జహీర్‌ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు హాజరుకానున్నారు.


Tags

Read MoreRead Less
Next Story