క్రీడలు

Thomas Cup 2022 : భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు కోటి రూపాయల నజరానా..!

Thomas Cup 2022: థామస్‌ కప్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు భారత ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది.

Thomas Cup 2022 :  భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు కోటి రూపాయల నజరానా..!
X

Thomas Cup 2022: థామస్‌ కప్‌ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు భారత ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి నజరానాగా ప్రకటించారు.

సింగిల్స్‌, డబుల్స్‌ లో అద్భుతంగా రాణించిన భారత్‌ ఫైనల్లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ ఇండోనేషియాపై 3-0తో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో తొలిసారి కప్‌ అందుకుంది. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

థామస్‌ కప్‌ ను భారత్ గెలుచుకోవడం పట్ల దేశం మొత్తం ఉప్పొంగిపోయింది. వారికి అభినందనలు.. ఈ విజయం చాలా మంది రాబోయే క్రీడాకారులను ప్రేరేపిస్తుంది అని మోదీ ట్వీట్ చేశారు.


Next Story

RELATED STORIES