IPL: భయపడం.. వెనక్కి తగ్గం

ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైనా.. బ్యాటింగ్‌లో తగ్గేదేలే అని సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి స్పష్టం చేశాడు. వరుస ఓటములకు తాము ఏ మాత్రం భయపడబోమని, దూకుడైన బ్యాటింగ్ విధానాన్నే కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. త్వరలోనే తిరిగి పుంజుకుంటామని వెటోరి ధీమా వ్యక్తం చేశాడు. 'మా బ్యాటింగ్ అప్రోచ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ పిచ్ కండిషన్స్‌ను మేం బాగా రీడ్ చేయాలి. ప్రత్యర్థి బౌలర్లను గౌరవించాలి. వారి వ్యూహాలను అర్థం చేసుకునేలా ప్రణాళికలు రచించాలి.
దానికే భయపడతామా..?
" మా టాప్-3 బ్యాటర్ల కోసం ప్రణాళికలు రెడీ చేసినా.. వాటిని అమలు చేయడంలో వారు విఫలమయ్యారు. అయితే ఈ ఓటములకు నేనైనా.. ప్యాట్ కమిన్స్ అయినా అస్సలు భయపడం. మా కెరీర్‌లో ఎనాడు భయపడిన సందర్భాలు లేవు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం సరి కాదని మాకు తెలుసు. ఈ వరుస పరాజయాలు మా లక్ష్యాలను దెబ్బతీయవచ్చు. గతేడాది రన్నరప్‌గా నిలిచి.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి.. అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న తర్వాత ఈ వరుస ఓటములను జీర్ణించుకోవడం కష్టం.'అని డానియల్ వెటోరి చెప్పుకొచ్చాడు.
దారుణమైన ట్రోల్స్
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఐదో మ్యాచులో కనీసం 150 పరుగులు చేస్తానికి సన్ రైజర్స్ జట్టు ముప్పు తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో సన్ రైజర్స్ జట్టు పేరు చెబుతే.. ఇతర జట్ల బ్యాటర్లు భయపడే వారు. 150 పరుగులు కొట్టినా.. ఆ స్కోరు కాపాడుకొని గెలిచేంత బలంగా సన్ రైజర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉండేది.. కానీ ఈ సీజన్ లో 200 పరుగులు కొట్టినా కూడా స్కోరును డిపెండ్ చేయలేని స్థితిలో బౌలింగ్ విభాగం కొనసాగుతుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ జట్టుపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ నడుతుస్తున్నాయి. 300 పరుగుల రికార్డు తర్వాత విషయం కానీ.. ముందు ఓ విజయం దక్కించుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. కనీస 170, 180 పరుగులైన చేసే దమ్ము లేదు కానీ వైల్డ్ ఫైర్ చూపిస్తామని రీల్స్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com