SRH: సన్‌రైజర్స్ ఏమీ మారలేదు

ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఆటతీరు ఏమాత్రం మారలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను విజయంతో ఆరంభించన సన్‌రైజర్స్.. ఆ తర్వాత గాడి తప్పింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కత్తాతో జరిగిన మ్యాచులో ఘోర పరాజయం పాలైంది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఈ పరాజయంతో సన్‌రైజర్స్ ఓటముల హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సన్‌రైజర్స్ ప్లేయర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అర్ధశతకాలతో మెరిసిన అయ్యర్, రఘువంశీ
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలో కోల్‌కత్తాకు గట్టి షాక్ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆరంభంలోనే ఇద్దరూ పెవిలియన్ చేరారు. తన మొదటి ఓవర్లోనే హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ క్వింటన్ డికాక్(1) వికెట్ ను పడగొట్టాడు. 14 పరుగుల వద్ద జట్టు మొదటి వికెట్ కోల్పోగా.. తర్వాత ఓవర్లో సునీల్ నరైన్(7)ను షమీ వెనక్కి పంపాడు. అనంతరం వెంకటేష్ అయ్యర్ 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి రాణించాడు. అంగ్క్రిష్ రఘువంశీ కూడా అర్ధ సెంచరీ చేశాడు. వెంకటేశ్ అయ్యర్ (60; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రఘువంశీ (50; 32 బంతుల్లో 2 సిక్సులు, 5 ఫోర్లు) చెలరేగారు. కెప్టెన్ అజింక్య రహానే (38; 27 బంతుల్లో 4 సిక్సులు, ఒక ఫోర్), రింకుసింగ్ (32*; 17 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. చివరి బంతికి రస్సెల్ (1) రనౌటయ్యాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
పోరాటమే లేకుండా..
201 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(33), మెండిస్(27) పర్వాలేదన్పించగా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇదే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ట్రావిస్ హెడ్ (4) క్యాచ్ ఔటయ్యాడు. రెండో ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (2) పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్ తొలి బంతికి ఇషాన్ కిషన్ (2)ను వైభవ్ అరోరా ఇంటికి పంపించాడు. దీంతో ఆ జట్టు 9 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్లాసెన్ (33: 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. మెండిస్ (27: 20 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు అందరూ దారుణంగా విఫలమయ్యారు.దీంతో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు 120 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 3/29, వరుణ్ చక్రవర్తి 3/22, రస్సెల్ 2/21, హర్షిత్ రాణా 1/15, సునీల్ నరైన్ 1/30 వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వైభవ్ అరోరాకు వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com