WorldCup: ఫైనల్లో శ్రీలంక గెలుపు, క్వాలిఫయర్-1గా వరల్డ్‌కప్‌లోకి..

WorldCup: ఫైనల్లో శ్రీలంక గెలుపు, క్వాలిఫయర్-1గా వరల్డ్‌కప్‌లోకి..
X

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఫైనల్‌లో శ్రీలంక జట్టు నెదర్లాండ్స్‌ని ఓడించింది. ఓడినా, గెలిచినా ఇరుజట్లకు వచ్చే నష్టం ఏమీలేదు. వరల్డ్‌కప్‌కి ఇరు జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్-1గా, ఓడిన జట్టు క్వాలిఫయర్-2గా బరిలో దిగనున్నాయి. నెదర్లాండ్స్‌ని 128 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్‌-1గా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభంలో మంచిగానే ఆడినా, చివర్లో టపటపామంటూ వికెట్లు కోల్పోయి 233 పరుగులే చేసింది. అయినా వారి బౌలర్లు రాణించడంతో నెదర్లాండ్స్‌ని 105 పరుగులకే ఆలౌట్ చేసింది. 4.3 ఓవర్లలో 25/0 గా నెదర్లాండ్స్ స్కోర్ 10 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. తర్వాతి పలు ఓవర్లలోనే 49/6 గా చతికిలపడింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టులో ఓపెనర్ మ్యాక్స్‌ ఓడౌడ్ చేసిన 33 పరుగులే అత్యధికం. చివరికి 23.త్రీ ఓవర్లలో కేవలం 105 పరుగులు చేసి ఆలౌటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ 4 వికెట్లు తీయగా, మధుశంక 3 వికెట్లు, హసరంగ 2 వికెట్లు తీశారు.


అంతకు ముందు తొలి ఇన్సింగ్స్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు పవర్‌ప్లేలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 44 పరుగులు చేసింది. పవర్ ప్లే తరువాతి ఓవర్లోనే 23 పరుగులు చేసి నిసంక ఔట్ అయ్యాడు. తరువాత వచ్చిన వికెట్ కీపర్ కుషాల్ మెండిస్, అరాచిగెలు సింగిల్స్‌, డబుల్స్‌తో స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. అనంతరం 116 పరుగుల వద్ద మెండిస్ ఎల్బీగా వెనుదిరిగినా, అరాచిగే ధాటిగా ఆడుతూ 65 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 35 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులతో భారీ స్కోర్‌ దిశగా సాగిన శ్రీలంక ఇన్నింగ్స్ తరవాత కేవలం 53 పరుగులు చేసి మిగిలిన 7 వికెట్లు కోల్పోవడంతో 233 పరుగులకే ఆలౌటయింది. 4 వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంక ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపియ్యాడు.

Tags

Next Story