Srilanka vs Pakistan: 166 పరుగులకే శ్రీలంక ఆలౌట్

Srilanka vs Pakistan: 166 పరుగులకే శ్రీలంక ఆలౌట్
పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ 4 వికెట్లు తీశాడు.

Srilanka vs Pakistan: పాకిస్థాన్‌తో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చతికిల పడింది. ఆట మొదలైన రోజు కనీసం పూర్తి రోజు నిలవకుడా కేవలం 166 పరుగులకే ఆలౌటయింది. శ్రీలంక జట్టులో ధనంజయ డిసిల్వా మాత్రమే అత్యధికంగా 57 పరుగులు చేశాడు. ఆపై మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్, శ్రీలంక బ్యాట్స్‌మెన్ తడబడిన అదే పిచ్‌పై కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 145 పరగులు చేసింది. బాబర్ ఆజాం(8), ఓపెనర్ అబ్ధుల్లా షఫీక్‌(74, 99 బంతులు, 7x4, 2x6)లు క్రీజులో ఉన్నారు. పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ 4 వికెట్లు తీశాడు.


మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 3వ ఓవర్లోనే ఓపెనర్ మధుష్క వికెట్‌ కోల్పోయింది. కష్టమైన రన్‌ కోసం ప్రయత్నించడంతో మధుష్క(4) రనౌట్ అయ్యాడు. అక్కడి నుంచే శ్రీలంక పతనం మొదలైంది. 7వ ఓవర్లోనే 2వ వికెట్ కూడా కోల్పోయింది. తన వరుస ఓవర్లలో కీలకమైన ఏంజెలో మథ్యూస్(9), దిమత్ కరణరత్నేల(17)ను నసీం షా వెనక్కి పంపి దెబ్బతీశాడు. తర్వాత మరో 16 ఓవర్లపాటు చండిమల్(34), ధనంజయలు వికెట్‌ పడకుండా ఆడారు. 34వ ఓవర్లో నసీం షా షార్ట్ పిచ్ బంతితో చండిమల్‌ను వెనక్కి పంపాడు. వరుస ఓవర్లోనే స్వల్ప వ్యవధుల్లోనే శ్రీలంక అన్ని వికెట్లు కోల్పోయింది. 35వ ఓవర్లో అబ్రార్ బౌలింగ్‌లో సింగిల్‌తో అర్ధసెంచరీ పూర్తిచేసిన ధనంజయ పూర్తిచేసుకున్నాడు. కానీ అదే ఓవర్లో సమరవిక్రమ(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. తన తర్వాతి ఓవర్లోనే ధనంజయను కూడా ఔట్ చేశాడు. 136 పరుగుల వద్ద జయసూర్య(1) రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక చివరి 2 వికెట్లను అబ్రార్ తీయడంతో 48.4 ఓవర్లలోనే 166 పరుగులకు టీ సెషన్‌ కంటే ముందే ఆలౌటయింది. నసీం షా 3 వికెట్లు, షాహిన్ అఫ్రిదీ 1 వికెట్ తీశాడు.


తన మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ కూడా 3వ ఓవర్లోనే 13 పరుగుల వద్ద ఓపెనర్ ఇమాముల్ హక్(6) వికెట్ కోల్పోయింది. క్రీజులో వచ్చినఅబ్ధుల్లా, షాన్ మసూద్‌(51)లు ఓవర్‌కి 7 పరుగులకు పైగా రన్‌రేట్‌తో శ్రీలంక బౌలర్లను అలవోకగా ఎదుక్కొన్నారు. ఈ క్రమంలో అబ్ధుల్లా 49 బంతుల్లో ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ చేశాడు. షాన్ మసూద్ 44 బంతుల్లో అర్థసెంచరీ పూర్తిచేశాడు. మరో 2 బంతులు మాత్రమే ఆడి అశిత బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వెలుతురు తక్కువగా ఉండటంతో మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్లు ఆటని ముగించారు. శ్రీలంక బౌలర్లు అసిత 2 వికెట్లు తీశాడు.

Tags

Read MoreRead Less
Next Story