Srilanka vs Pakistan: 5వ రోజు ఫలితం తేలనున్న టెస్ట్ మ్యాచ్

Srilanka vs Pakistan: 5వ రోజు ఫలితం తేలనున్న టెస్ట్ మ్యాచ్

Srilanka vs Pakistan: శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌ ఫలితం 5వ రోజు కచ్చితంగా తేలనుంది. రెండవ ఇన్సింగ్స్‌(2nd Innings)లో 279 పరుగులకు ఆలౌటైన శ్రీలంక , పాకిస్థాన్‌కి 131 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ 3 వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. పాక్ విజయానికి 83 పరుగులు అవసరం కాగా, శ్రీలంక విజయానికి 7 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. క్రీజులో బాబర్ ఆజాం(6), ఇమామ్ ఉల్ హక్‌(25)లు ఉన్నారు. స్పిన్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై ఫలితం ఎలా రానుందో ఆసక్తికరంగా మారింది.

14 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో 4వ రోజు ఆరంభించిన శ్రీలంక మరో 28 పరుగులు జోడించి ఓపెనర్ కరుణరత్నే వికెట్ కోల్పోయింది. మధుష్క(52), కుషాల్ మెండిస్‌(18)లు వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సులు బాదారు. 79 పరుగుల వద్ద కుషాల్ మెండిస్ ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన ఏంజెలో మాథ్యూస్ 7 పరుగులు మాత్రమే చేసి స్లిప్‌లో బాబర్ ఆజాం అద్భుతంగా క్యాచ్‌ పట్టి వెనక్కి పంపాడు. లంచ్ తర్వాత ఫోర్ కొట్టి మధుశంక అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఓవర్లోనే కీపర్ క్యాచ్‌గా ఔటయ్యాడు.

ధనంజయ డిసిల్వా, చండిమల్‌(28)లు బౌండరీలు, సిక్సులతో స్కోర్ బోర్డ్ వేగం పెంచారు. వీరిద్దరు కలిసి 5వ వికెట్‌కు 59 పరుగులు జోడించి శ్రీలంకను 10 పరుగుల ఆధిక్యంలో నిలిపారు. ధనంజయ డిసిల్వా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 61 పరుగుల ఆధిక్యంతో టీ విరామానికి వెళ్లారు.


టీ విరామం తర్వాత శ్రీలంక బ్యాట్స్‌మెన్ భారీ షాట్లకు యత్నించారు. ఈ క్రమంలో రమేష్ మెండిస్‌ 42 పరుగులకు వెనుదిరిగాడు. వేగంగా ఆడే క్రమంలో ధనంజయ డిసిల్వా 82 పరుగులకు 8వ వికెట్‌గా ఔటయ్యాడు. మరో 10 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 2 వికెట్లు కోల్పోయి, 131 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పాక్ బౌలర్లలో నొమన్ అలీ, అబ్రార్ అహ్మద్‌లు తలా 3 వికెట్లు తీశారు.

లక్ష్య ఛేదననలో పాకిస్థాన్ జట్టు నెమ్మదిగా ఆడింది. 7వ ఓవర్లలో ఓపెనర్ అబ్ధుల్లా షపీక్(8) వికెట్‌ని కోల్పోయింది. 11వ ఓవర్లో 36 పరుగుల వద్ద షాన్ మసూద్‌(7) వికెట్‌ను కూడా కోల్పోయింది. లేని పరుగు కోసం వెళ్లి నొమన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజాంలు మరో వికెట్‌ పడకుండా 4వ రోజుని ముగించారు.

Tags

Read MoreRead Less
Next Story