WorldCup Qualifiers:5 వికెట్లతో హసరంగ రికార్డ్, సూపర్-6 కి శ్రీలంక

మూడు వరుస విజయాలతో క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక జట్టు సూపర్ సిక్స్‌కి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 133 పరుగుల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో క్వాలిఫయర్స్ రేస్ నుంచి ఐర్లాండ్ తప్పుకుంది. 5 వికెట్లతో శ్రీలంక బౌలర్ హసరంగ ఐర్లాండ్ పతనాన్ని శాసించాడు. హసరంగకు ఇది వరుసగా మూడోసారి 5 వికెట్ల ఘనత కావడం విశేషం. వన్డేల్లో ఈ ఘనత సాధించిన బౌలర్లలో హసరంగా రెండవ బౌలర్ మాత్రమే. ఇంతకు ముందు పాక్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉండేది. ఐర్లాండ్ ఆటగాళ్లు ఆండ్రూ బాల్‌బ్రిన్, హ్యారీ టెక్టార్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, జోష్ లిటిల్‌లను ఔట్ చేసి హసరంగా ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో మొదటి సెంచరీ సాధించిన శ్రీలంక కెప్టెన్ కరుణరత్నేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
326 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో ఐర్లాండ్ ఏ సందర్భంలో కూడా లక్ష్యం దిశగా సాగలేదు. ఆట మొదట్లోనే త్రీ వికెట్లు కోల్పోయింది. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం శ్రీలంకకు సులభం అయింది. 31 ఓవర్లలో 192 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే 103 పరుగులతో సెంచరీ చేయడంతో భారీ స్కోర్ సాధించింది. సెంచరీ అనంతరం ధాటిగా ఆటడానికి ప్రయత్నించి 38వ ఓవర్లో వెనదిరిగాడు.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్-బీ నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు కూడా సూపర్ సిక్స్‌కి వెళ్లాయి. గ్రూప్-ఏ నుంచి వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్ సూపర్ సిక్స్‌కి అర్హత సాధించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com