MERIKOM: విడాకులు తీసుకోనున్న స్టార్ బాక్సర్ మేరికోమ్..!

భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్.. విడాకులు తీసుకుబోతున్నారన్న వార్తలు క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని.. వీరి నులుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీ కోమ్ వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి విడాకుల గల కారణాల గురించి అనేక ఊహాగానాలు వస్తున్నా.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే వారిని దూరమయ్యేలా చేసిందంటూ జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన ఆమె.. భర్త కరుంగ్ ఓంక్లర్‌తో పెళ్లి బంధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలో ఈ జంట డివోర్స్ తీసుకుంటారని వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల చిచ్చు
మేరీకోమ్ సొంతరాష్ట్రం మణిపూర్‌లో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో పోటీపడిన మేరీ భర్త ఓంక్లర్ ఓటమిపాలయ్యాడు. ఆ ఎన్నికల క్యాంపెయినింగ్ కోసం ఈ దంపతులు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారట. కానీ అనూహ్య ఓటమి ఎదురవడంతో మేరీకోమ్ తట్టుకోలేకపోయిందట. భర్త ఓడిపోవడం, డబ్బులు కూడా పోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైందట. దీంతో కొన్నాళ్ల తర్వాత నలుగురు పిల్లల్ని తీసుకొని ఫరియాబాద్‌కు వచ్చేసిందట మేరికోమ్. అటు ఆమె భర్త ఓంక్లర్ కొంతమంది కుటుంబ సభ్యులతో కలసి ఢిల్లీలోనే ఉంటున్నాడట. మేరీకోమ్ దంపతులు విడిపోవడానికి ఎన్నికలే కారణమని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు నష్టపోవడం, ఓటమి పాలవడం ఆమెను తీవ్రంగా బాధించాయట. ఎలక్షన్స్‌లో పోటీ చేసేది లేదని భర్త ఓంక్లర్ ఎంత మొత్తుకున్నా మేరీకోమ్ బలవంతం చేసి నిలబెట్టారని.. తీరా ఓడిపోయాక, ఆయన్నే బాధ్యుడ్ని చేస్తూ వదిలేసి వేరే చోటుకు వెళ్లిపోయిందట. దీంతో మేరీ తప్పు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com