CRICKET: ఇంగ్లాండ్‌కు మరో షాక్‌... సీనియర్‌ బౌలర్‌ వీడ్కోలు

CRICKET: ఇంగ్లాండ్‌కు మరో షాక్‌... సీనియర్‌ బౌలర్‌ వీడ్కోలు
X
అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన స్టీవెన్‌ ఫిన్‌... ఓటమిని అంగీకరించానని భావోద్వేగ ట్వీట్‌...

ఇంగ్లాండ్ ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌(England fast bowler Steven Finn ) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌(all forms of cricket)కు రిటైర్మెంట్ ప్రకటించాడు(announces retirement). మోకాలి గాయంతో బాధపడుతున్న ఫిన్‌.. చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. గత 12 నెలలుగా గాయం నుంచి కోలుకునేందుకు తాను పోరాడుతున్నానని(I have been fighting a battle with my body for the last 12 months ), దానితో ఓటమిని అంగీకరించానని ఫిన్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. 2005లో మిడిల్‌ఎసక్స్‌ తరఫున అరంగేట్రం చేసి ఇంగ్లాండ్‌కు ఆడడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్న ఫిన్‌.. తన ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగలేదని పోస్ట్‌లో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను దానిని ఇష్టపడ్డానని.. తన కెరీర్‌కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలనీ ఫిన్‌ ట్వీట్‌ చేశాడు.


2010 నుంచి 2017 వరకు ఇంగ్లాండ్ తరఫున 36 టెస్టులు ఆడిన ఫిన్‌ 3.55 ఎకానమీతో 125 వికెట్లు పడగొట్టాడు. 6/79తో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 69 వన్డేల్లో 5.06 ఎకానమీతో 102 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన (5/33). 21 అంతర్జాతీయ టీ20లు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. 2010లో జరిగిన యాషెస్‌ సిరీస్‌తో ఫిన్‌ అరంగేట్రం చేశాడు.

Tags

Next Story