KL Rahul: కేఎల్ రాహుల్ భర్తగా రావడం నా కూతురు అదృష్టం: సునీల్ షెట్టి

KL Rahul: కేఎల్ రాహుల్ భర్తగా రావడం నా కూతురు అదృష్టం: సునీల్ షెట్టి

కేఎల్ రాహుల్(KL Rahul) లాంటి వ్యక్తి తన కూతురికి భర్తగా రావడం తన కూతురు అదృష్టం అని బాలివుడు సీనియర్ నటుడు సునీల్ షెట్టి(Suniel Shetty) అన్నాడు. జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాల గురించి కూతురు, నటి అథియాకి సలహాలు, సూచనలు అందజేశాడు. సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్‌పై వస్తున్న ద్వేషం చూస్తుంటే తనకి భయమవుతోందని వెల్లడించాడు.


ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన కూతురు అథియాకి సినిమా ఇండస్ట్రీలో విజయాన్ని అందుకున్నపుడు భయపడవద్దని చెప్పానన్నాడు. అలాగే ఫెయిల్యూర్‌ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. ఎవరైనా సరే తమ భాగస్వాముల్ని ఎలాంటి అనుమాలు పెట్టుకోకుండా నమ్మాలని చెప్పాడు. తన భాగస్వామి కేఎల్ రాహుల్‌(KL Rahul) ఒక అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు కాబట్టి, వివిధ దేశాల్లో ప్రయాణిస్తుంటాడు. కెరీర్‌లో అందరు నటుల్లాగే అతనూ విజయాలు, పరాజయాలు ఎదుర్కొంటాడు కాబట్టి ఎల్లపుడూ అతనికి మద్దతుగా తన వెంటే ఉండాలని సలహా ఇచ్చాడు.



కేఎల్ రాహుల్‌పై వస్తున్న విమర్శలపై...ఈ రోజు సోషల్ మీడియాలో అల్గారిథమ్స్ మనుషులపై ద్వేషాన్ని పెంచుతున్నాయి, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వారిని నియంత్రిస్తోంది. ఇది చాలా భయంకరమైందని స్పందించాడు. ఆటగాళ్లు బాగా ఆడుతున్నపుడు, వారిని ప్రపంచం చివరి దాకా తీసుకెళ్తారు. నాకు సునీల్ గవాస్కర్ అంటే చాలా ఇష్టం, నేను మరణించే దాకా నా హీరో అతనే అన్నాడు.

ఈ సందర్భంగా తన అల్లుడైన కేఎల్ రాహుల్‌కు మంచితనం పనికిరాదని సలహాలు ఇచ్చాడు.

"రాహుల్ మంచి అబ్బాయి. కానీ మరీ ఎక్కువ మంచితనంగా ఉండటం వల్ల మనల్ని తక్కువ అంచనా వేస్తారు. మంచితనం అంటే ఇలానే ఉండాలి అనేలా ఉంటాడు. నేను నా కూతురుకి ఎప్పుడూ చెబుతుంటా. కేఎల్ రాహుల్ భర్తగా రావడం నీకు అదృష్టం" అని వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story