sunil chhetri: ఫుట్‌బాల్ దిగ్గజం పునారాగమనం

భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి మళ్లీ టీమిండియా జెర్సీలో మెరవనున్నాడు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఛెత్రి ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. 'సునీల్ ఛెత్రి జట్టులోకి తిరిగొచ్చాడు. భారత ఫుట్‌బాల్ దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి మార్చిలో ఫిఫా మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమవుతున్నాడు'అని ఏఐఎఫ్‌ఎఫ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొంది.
40 ఏళ్ల వయసులోనూ..
40 ఏళ్ల సునీల్ ఛెత్రి గతేడాది జూన్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలికినా.. ఇండియన్ సూపర్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. తాజా సీజన్‌లో అతను 12 గోల్స్ నమోదు చేశాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. గతేడాది దారుణంగా విఫలమైన బెంగళూరు ఎఫ్‌సీ.. సునీల్ ఛెత్రి అసాధారణ ప్రదర్శనతో ఈ సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
ఫుట్‌బాల్ దిగ్గజం
2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోకి అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రీ.. 151 మ్యాచ్‌ల్లో 94 గోల్స్ నమోదు చేశాడు. ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో(217 మ్యాచ్‌ల్లో 135 గోల్స్), లియోనల్ మెస్సీ (191 మ్యాచ్‌ల్లో 112 గోల్స్) మాత్రమే ఛెత్రీ కంటే ముందున్నారు. భారత్.. ఈ నెల బంగ్లాదేశ్, మాల్దీవులతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లతోనే సునీల్ ఛెత్రి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. **భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఛెత్రీ.. మళ్లీ అదే చేయాలని చూస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com