SRH: సన్ రైజింగ్ కాకపోవడానికి కారణాలివే..!

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ఆల్మోస్ట్ ముగిసింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పరాజయంతో ప్లే ఆఫ్ ఆశలు నిర్జీవమయ్యాయి. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ ఎడిషన్ ఆరంభంలో క్రికెట్ నిపుణులు సైతం ఎస్‌ఆర్‌హెచ్ జట్టును చూసి భయపడిపోయారు. ఇక ప్రత్యర్థులు వెన్నులో మొదటి మ్యాచ్ నుంచే వణుకు పుట్టించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి విధ్వంసకర సైన్యానికి ప్యాట్ కమ్మిన్స్ లాంటి అద్భుతమైన నాయకుడి సారథ్యం ఉన్న కానీ ఆరెంజ్ ఆర్మీకి తీవ్ర నిరాశే ఎదురైంది.
వైఫల్యం ఎక్కడంటే..?
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో 'ది బెస్ట్ కెప్టెన్' ఎవరని అడిగితే అందరు టక్కుమని ప్యాట్ కమ్మిన్స్ పేరు చెబుతారు. ఆస్ట్రేలియా జట్టునే కాదు గత సీజన్‌లో ఆయన ఎస్‌ఆర్‌హెచ్ టీంని నడిపించిన తీరు క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తించుకుంటుంది. కానీ ఈ సీజన్‌లో ప్యాట్ ప్రభావం, యుక్తులు పని చేయలేదు. టీంకు గుర్తింపు తీసుకొచ్చిన ఆయన అగ్రెసివ్ ఇంటెంట్ ఫార్ములానే ఈ సీజన్‌లో కొంపముంచింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే టీం 286 పరుగుల అసాధారణ టార్గెట్ సెట్ చేసి మిగతా టీంలకు ఎస్‌ఆర్‌హెచ్‌ని ఎదురుకోవటానికి స్ట్రాటజీస్ తయారు చేసుకునేలా చేసింది. కానీ ఎస్‌ఆర్‌హెచ్.. వాళ్ల స్ట్రాటజీలను ఛేదించే మరో యుక్తిని సిద్ధం చేసుకోలేకపోయింది. దీంతో ప్రతి టీం వచ్చి ఎస్‌ఆర్‌హెచ్ నుంచి రెండు పాయింట్లు తీసుకొని పోయాయి. మధ్యలో కొందరు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. ప్రతిసారి అగ్రెషన్ పనికి రాదు నిలకడతో పాటు కొత్త టెక్నీక్స్ ఫాలో కావాలని సూచించిన ఎస్‌ఆర్‌హెచ్ పెడ చెవిన పెట్టింది. దీంతో కాటేరమ్మ కొడుకులు రెండు అంకెల స్కోర్ చేయడానికే నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాటర్ల ఘోర వైఫల్యంతో సన్ రైజర్స్ మ్యాచుల్లో తేలిపోయింది.
తెలుగోడు అబ్బా..
నితీష్ కుమార్ రెడ్డి.. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఆల్ రౌండర్. గత సీజన్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైతే మిడిలార్డర్‌లో వచ్చి క్లాసిక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఈజీ విక్టరీలను అందించాడు. ఒక జట్టు పరిపూర్ణం కావాలంటే మిడిలార్డర్ సెట్ అయితేనే పరిపూర్ణం అయ్యిందంటారు. నితీష్ రాకతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆ లోటు తీరిపోయిందని అంత భావించారు. కానీ ఈ సీజన్‌లో నితీష్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com