తడబడ్డ సన్‌‌రైజర్స్.. ఢిల్లీ లక్ష్యం 135 పరుగులు..!

తడబడ్డ సన్‌‌రైజర్స్.. ఢిల్లీ లక్ష్యం 135 పరుగులు..!
ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాదు జట్టు ఆది నుంచి తడబడింది. ఫస్ట్ ఓపెనర్ గా వచ్చిన వార్నర్ డకౌట్ అవగా.. ఆ తర్వాత వచ్చిన వారందరూ వెంటవెంటనే వెనుదిరిగారు. చివర్లో సమద్(28), రషీద్ ఖాన్(22) రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది సన్ రైజర్స్.. కాగా ఢిల్లీ బౌలర్లలో రాబడా 3, నోర్జే 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు.

Tags

Next Story