SURYA: సూర్య గాయం ఉత్తిదేనా..? డ్రామా చేశారా..?

గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం డ్రామానే అని కొందరు క్రీడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్, వాషింగ్టన్ జోడి అదరగొడుతున్న నేపథ్యంలో ఫేక్ గాయంతో డ్రామా చేసి మ్యాచ్ ని స్లో చేసినట్లు సూర్యకుమార్ యాదవ్ పై ఆరోపణలు వస్తున్నాయి. మ్యాచ్ స్లో అయితే మ్యాచ్ రిజల్ట్ పై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అనూహ్యంగా ఆ తర్వాత వాషింగ్టన్ ఔట్ అయ్యాడు. దీంతో సూర్యపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒంటి కాలుతో అయినా ఆడతాడు
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయంపై ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనే కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఒంటి కాలితో కూడా క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడుతాడని స్పష్టం చేశాడు. అతని గాయం పెద్దది కాదని, పూర్తి ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com