SURYAKUMAR: "తుది జట్టు ఎంపికే పెద్ద తలనొప్పి"

ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. వర్షం కారణంగా ఈ ఐదు టీ20ల సిరీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా మారిపోయింది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. తమ ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు. 'కాన్బెర్రాలో జరిగిన తొలి మ్యాచ్ కూడా పూర్తవ్వాలని కోరుకున్నాం. కానీ వర్షం మన నియంత్రణలో లేని విషయం. 0-1తో వెనుకంజలో నిలిచిన స్థితి నుంచి మేం పుంజుకున్న విధానం అద్బుతం. ఈ గెలుపు క్రెడిట్ ఆటగాళ్లదే. పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. బుమ్రా-అర్ష్‌దీప్ సింగ్‌లది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. అక్షర్, వరుణ్ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా రాణించాడు. మా ఆటగాళ్లంతా ఇప్పటికే చాలా టీ20 క్రికెట్ ఆడారు. జట్టు కోసం ఏమైనా చేయగలరు. జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నందున తుది జట్టు ఎంపిక స్వీట్ హెడెక్ మారింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి మూడు బలమైన జట్లతో ఆడటం.. ప్రపంచకప్ టోర్నీకి గొప్ప సన్నాహకంగా ఉంటుంది.
సెంచరీతో రెచ్చిపోయిన జురెల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌ను కనబరిస్తున్నాడు. సౌతాఫ్రికా-తో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సూపర్ జెంచరీతో జట్టును ఆదుకున్న జురెల్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు. జురెల్ 159 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో తన ఆరువ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తొలుత హర్ష్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధ్రువ్.. ఆ తర్వాత కెప్టెన్ పంత్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జురెల్ ఓవరాల్‌గా 169 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 127 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా ‘ఏ’ ముందు 418 పరుగుల భారీ లక్ష్యం పెట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 78/3తో శనివారం ఆట కొనసాగించిన భారత్ ‘ఏ’ జట్టు 382/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో మొదట్లో భారత్ ‘ఏ’ తడబాటుకు గురైంది. రెండో రోజే మూడు వికెట్లు కోల్పోగా.. రాహుల్(27), కుల్దీప్(16) కూడా కాసేపు పోరాడి వికెట్లు పారేసుకున్నారు. దీంతో 116 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. క్రీజులోకి వచ్చిన పంత్ కాసేపటికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో ధ్రువ్ జురెల్ మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన అతను 170 బంతుల్లో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు, హర్ష్ దూబే(84) కూడా చెలరేగాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. జురెల్, దూబే రెచ్చిపోవడంతో స్కోరు 300 మార్క్ అందుకుంది. ఈ క్రమంలో దూబె తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దూబె అవుటైన తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చిన పంత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

