RANJI TROPHY: రంజీ జట్టులోకి సూర్యకుమార్, దూబే

వరుసగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు.. దేశవాళీ బాట పడుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా కీలక ఆటగాళ్లు అందరూ దేశవాళీలో ఆడుతుండగా.. తాజాగా టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్ శివమ్ దూబేలను ముంబై రంజీ జట్టు ప్రాబబుల్స్‌లో ఎంపిక చేశారు. క్వార్టర్ ఫైనల్స్ చేరిన ముంబై జట్టు... ఈ నెల 8న హర్యానాతో మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ కోసం ప్రకటించిన 18 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్‌లో సూర్య కుమార్, శివమ్ దూబేకు చోటు దక్కింది. ఈ సీజన్‌లో వీరిద్దరు చెరో రంజీ మ్యాచ్ ఆడారు. అయితే ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లు వీరిద్దరూ ఆడారు. భారత జట్టు సూర్యకుమార్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌పై 4-1 తేడాతో విజయం సాధించింది. అయితే భారత టెస్టు, వన్డే జట్లలో చోటు దక్కించుకోలేకపోతున్న సూర్యకుమార్.. రంజీ ట్రోఫీలో సత్తా చాటాలని భావిస్తున్నాడు.
సూర్య బ్యాటింగ్ శైలి మార్చుకోవాల్సిందే: అశ్విన్
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌గా తీవ్ర నిరాశపర్చాడు. సిరీస్ కైవసం చేసుకున్నా.. స్కై వైఫల్యం మాత్రం టీమిండియాను ఆందోళన పెట్టింది. సూర్య బ్యాటింగ్ గురించి భారత మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందించాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ శైలిని కొద్దిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. సూర్య కోసం ఒకే వ్యూహం రచించి మరీ అవుట్ చేస్తున్నారని అన్నాడు.
నిమిషాల్లోనే టికెట్స్ బుక్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడనున్న మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను నిర్వాహకులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అయితే, మ్యాచ్‌ల టికెట్లన్నీ హాట్‌కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. భారత్, పాక్ మ్యాచ్ టికెట్ల కోసం సుమారు 1,50,000 మంది పోటీపడినట్లు సమాచారం. CTలో భాగంగా టీమిండియా ఈనెల 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కాగా CTకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com