RECORDS: సూర్యవంశీ రికార్డుల వైభవం

RECORDS: సూర్యవంశీ రికార్డుల వైభవం
X
తొలి ఐపీఎల్ లోనే చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

అతి పిన్న వయసులో ఐపీఎల్‌కి వచ్చి రికార్డు క్రియేట్ చేయడమే కాక, తన పెర్ఫార్మెన్స్‌తో వండర్స్ క్రియేట్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. లీగ్ చరిత్రలో 20 ఏళ్లలోపు ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌‌గా ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో 24 సిక్సులు కొట్టాడు ఈ చిచ్చర పిడుగు. వైభవ్ చేసిన 252 పరుగుల్లో 216 పరుగులు బౌండరీలు కొట్టి సాధించినవే. వైభవ్ ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 2010లో 37 బంతుల్లో సెంచరీతో అగ్రస్థానంలో ఉన్న యూసుఫ్ పఠాన్‌ను వైభవ్ అధిగమించాడు. ఇంకా 20 ఏళ్ల వయసులోపు అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.ఈ సీజన్లో అతను మొత్తం 24 సిక్సర్లు కొట్టాడు. అత్యధిక స్ట్రైక్ రేట్ కూడా వైభవ్ పేరిటే ఉంది. 206 స్ట్రైక్ రేట్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

బీసీసీఐపై కోల్‌కత్తా ఆగ్రహం

వర్షాల నేపథ్యంలో ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌లకు అదనపు సమయం కేటాయిస్తూ బీసీసీఐ కొత్త రూల్ పాస్ చేసింది. అయితే దీనిపై డిఫెండింగ్ ‌చాంపియన్ కోల్ కత్తా యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రూల్ టోర్నీ ప్రారంభం నుంచి ఉంటే తమకు ఇంకా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉండేదని, మధ్యలో మార్చడమేంటని కోల్ కత్తా సీఈవో వెంకీ మైసూర్ అసహనం వ్యక్తం చేశారు. 120 నిమిషాల అదనపు సమయం ఉంటే మే 17న బెంగళూరు-కోల్ కత్తా మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేదికాదన్నారు.

యువ ఆటగాళ్లకు ధోనీ కీలక సూచన

యువ ఆటగాళ్లకు టీమిండియా మాజీ సారధి ధోనీ కీలక సూచనలు చేశాడు. తమ మీద అంచనాలు పెరిగినప్పుడు యువ ఆటగాళ్లు ఒత్తిడికి గురికావొద్దని తెలిపాడు. రాజస్థాన్ తో మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. సీనియర్‌ ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది నుంచి వారు నేర్చుకోవాలని సూచించాడు. యువ బ్యాటర్లంతా తొలి సీజన్‌ ఎలా ఆడారో.. అదే జోరును కొనసాగించడం చాలా ముఖ్యమన్నాడు. అలాగే బ్యాటర్లు ఎప్పుడూ తమను తాము నమ్ముకోవాలని చెప్పాడు. "మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దు. సీనియర్‌ ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది నుంచి నేర్చుకోండి. యువ ఆటగాళ్లు 200 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టమే. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారి సొంతం" అని అన్నారు. అంచనాల భారాన్ని మోయకుండా సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించాలని యువకులకు సూచించారు. **చెన్నై బౌలర్‌ కాంబోజ్‌పై ధోనీ ప్రశంసలు కురిపించాడు.

Tags

Next Story