T20: టీ20 ప్రపంచకప్ 5 వేదికలు షార్ట్ లిస్ట్?

ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన భారత్ మరో ఐసీసీ ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోయే పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం వేదికలను ఐసీసీ తాజాగా షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భారత్ నుంచి ఐదు వేదికలను ఎంపిక చేసినట్టు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నయ్, ముంబై, ఢిల్లీ ఆతిథ్య నగరాలుగా షార్ట్ లిస్ట్ చేసినట్టు పేర్కొన్నాయి. ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నట్టు తెలుస్తోంది. శ్రీలంకలో 2-3 మూడు స్టేడియాలు ఆతిథ్యమిస్తాయని తెలిసింది. కానీ, వాటిపై క్లారిటీ లేదు. ఒక్క వేదికగా కొలంబో కన్ఫర్మ్ అని సమాచారం. శ్రీలంక సెమీస్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుందని బీసీసీఐకి ఐసీసీ తెలియజేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఫైనల్‌కు పాకిస్తాన్ క్వాలిఫై అయితే టైటిల్ పోరు కూడా కొలంబోలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌తోపాటు ఫైనల్‌కు స్టాండ్ బై వేదికగా కొలంబోను ఖరారు చేయనున్నట్టు సమాచారం.
రైనా, ధావన్ ఆస్తులు జప్తు
భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో శిఖర్ ధావన్, సురేష్ రైనాకు సంబంధించిన రూ.11.14 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రైనా పేరు మీద ఉన్న రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ధావన్ పేరు మీద ఉన్న రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తిని తాత్కలికంగా జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లు ఈడీ అటాచ్ చేసిన ఆస్తులకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపలేరు. ఆన్ లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్లకు సంబంధించి శిఖర్ ధావన్, సురేష్ రైనాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా ఈ యాప్‌లకు ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి డబ్బును హవాలా రూపంలో తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సురేష్ రైనా, ధావన్‌లను విచారించిన ఈడీ.. ఇద్దరు మాజీ క్రికెటర్లు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరి ఆస్తులను తాత్కలికంగా ఈడీ అటాచ్ చేసింది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోన్న ఈడీ.. ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అన్ని విషయాలు తెలిసే 1xBet, దాని అనుబంధ సంస్థల ప్రమోషన్ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్‌కు చెందిన రూ.4.5కోట్ల స్థిరాస్తిని, సురేశ్‌కు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్లను సీజ్ చేసేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలిక ఉత్వర్తులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో మాజీ క్రికెటర్లను ఇప్పటికే ప్రశ్నించిన ఈడీ వారి ఆస్తులను సీజ్ చేస్తుందన్న వార్తలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

