T20 World cup 2024 : తొలిసారి ఫైనల్‌కు సఫారీలు..

T20 World cup 2024 : తొలిసారి ఫైనల్‌కు సఫారీలు..
X
. అఫ్గాన్‌పై అలవోక విజయం

టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా నేడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) , ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తరౌబ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. దింతో దక్షిణాఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా ఎదురుకోలేకపోయింది. ఇక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఒక్కరు మాత్రమే రెండు అంకెల స్కోరుని చేరుకున్నాడు. ఒమార్జై ఒక్కడే 10 పరుగులను చేసి అవుట్ అవ్వగా.. ఇన్నింగ్స్ లో ఎక్స్ట్రాలు 13 అత్యధిక స్కోర్ గా ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ అంత కలిపి కేవలం 43 పరుగులు మాత్రమే చేసారు. ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్మెన్స్ డక్ అవుట్ అయ్యారు. ఇక మరోవైపు దక్షిణాఫ్రికా బౌలర్లు విషయానికి వస్తే.. మార్కో జాన్సెన్, తబ్రైజ్ శంసిలు చెరో మూడు వికెట్లు.. కాగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ పతనానికి కారణం అయ్యారు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన దక్షిణిఫ్రికా.. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ డికాక్‌ను (5) ఫారుఖీ పెవీలియన్‌కు పంపించాడు. అయితే తర్వాత వచ్చిన మార్క్‌రమ్‌తో కలిసి రీజా హెండిక్స్‌ ఆడుతూపాడుతు జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇరువురు 23 రన్స్‌, 29 పరుగుల చొప్పున చేయడంతో 8.5 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగిసింది. దీంతో తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు సౌత్‌ఆఫ్రికా అడుగుపెట్టింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘాన్‌.. 11.5 ఓవర్లలో కేవలం 56 రన్స్‌కే ఆలౌటైంది. టోర్నీ ఆరంభం నుంచి అసాధారణ ప్రతిభ కనబరిన కాబూలీలు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. అజ్మతుల్లా (10) మినహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఆఫ్ఘాన్‌ను కుప్పకూల్చారు. వచ్చినవారు వచ్చినట్లే వెనుతిరుగుతున్నప్పటికీ బమర్జాయ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (8) కూడా ఆకట్టుకోలేకపోయాడు. రెహ్మానుల్లా, మహ్మద్‌ నబీ, నూర్‌ అహ్మద్‌ డకౌట్‌ అయ్యారు. కాగా, మరో సెమీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి.

Tags

Next Story