T20: ప్రపంచకప్‌లో టీమిండియాకు చావోరేవో

T20: ప్రపంచకప్‌లో టీమిండియాకు చావోరేవో
X
ప్రపంచకప్‌లో నేడు మహా సమరం... విండీస్‌తో టీమిండియా అమీతుమీ... గెలిస్తేనే సెమీస్‌కు భారత జట్టు

సూ­ప­ర్‌ 8 దశలో అడు­గు­పె­ట్టిన టీ20 ప్ర­పం­చ­క­ప్ మరింత ఉత్కం­ఠ­భ­రి­తం­గా మా­రిం­ది. సె­మీ­ఫై­న­ల్ బె­ర్త్ కోసం జట్లు చా­వో­రే­వో పో­రా­టం సా­గి­స్తు­న్న వేళ, భారత క్రి­కె­ట్ అభి­మా­నుల దృ­ష్టి మొ­త్తం కో­ల్‌­క­తా­లో­ని ఈడె­న్ గా­ర్డె­న్స్ పై ని­లి­చిం­ది. ఇక్క­డే భా­ర­త్‌ నేడు వె­స్టిం­డీ­స్‌­తో తల­ప­డ­నుం­ది. గె­లి­స్తే సె­మీ­స్‌­కు రెడ్ కా­ర్పె­ట్ పర­చి­న­ట్టే; ఓడి­తే టో­ర్నీ­కి గు­డ్‌­బై చె­ప్పా­ల్సిన పరి­స్థి­తి. ఇలాం­టి ఒత్తి­డి­మ­య­మైన నే­ప­థ్యం­లో ఈ మ్యా­చ్ క్వా­ర్ట­ర్ ఫై­న­ల్‌­ను తల­పి­స్తోం­ది. సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ నా­య­క­త్వం­లో­ని టీమ్ ఇం­డి­యా, షాయ్ హోప్ సా­ర­థ్యం­లో­ని కరే­బి­య­న్ జట్టు­తో సమ­రా­ని­కి సి­ద్ధ­మైం­ది. సూ­ప­ర్ 8లో తొలి మ్యా­చ్‌­లో న్యూ­జి­లాం­డ్ చే­తి­లో ఓటమి పా­లైన భా­ర­త్, ఆ తరు­వాత జిం­బా­బ్వే­పై ఘన వి­జ­యం సా­ధిం­చి ఆశ­ల­ను సజీ­వం­గా ఉం­చు­కుం­ది. అయి­తే ఆ మ్యా­చ్‌­లో 256 పరు­గు­లు చే­సి­న­ప్ప­టి­కీ, ప్ర­త్య­ర్థి­ని 148 పరు­గు­ల­కే కట్ట­డి చేసి ఉంటే రన్‌­రే­ట్ మరింత మె­రు­గ్గా ఉం­డే­ద­నే వి­శ్లే­ష­ణ­లు వి­ని­పిం­చా­యి. బౌ­లిం­గ్ వి­భా­గం­లో అర్ష్ దీప్ సిం­గ్ తప్ప మి­గ­తా బౌ­ల­ర్లు పరు­గు­లు సమ­ర్పిం­చ­డం ఆం­దో­ళన కలి­గిం­చిం­ది. వర్షం కా­ర­ణం­గా ఒక మ్యా­చ్‌­లో చె­రొక పా­యిం­ట్ వచ్చి­నా, అది భా­ర­త్ కంటే వె­స్టిం­డీ­స్‌­కే లా­భిం­చిం­ద­ని చె­ప్పా­లి. అం­దు­కే ఈ మ్యా­చ్‌­లో వి­జ­యం తప్ప మరో మా­ర్గం లేదు. టీ20ల్లో భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పటివరకు 30 సార్లు తలపడ్డాయి. అందులో 19 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, వెస్టిండీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. స్వదేశంలో భారత్ 8 విజయాలు సాధించగా, వెస్టిండీస్ గడ్డపై 5 మ్యాచ్‌లు గెలిచింది. తటస్థ వేదికలపై భారత్‌కి మంచి రికార్డు ఉంది.

అయితే టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం గణాంకాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు ఎదురెదురైన ఈ రెండు జట్లలో, భారత్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. వెస్టిండీస్ మూడు విజయాలు సాధించింది. కరేబియన్ జట్టు భారత జట్టుపై 196 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేయగా, భారత్ వెస్టిండీస్‌పై 192 పరుగులు సాధించింది. ఈ గణాంకాలు మ్యాచ్ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.

పిచ్ బ్యాటర్లకే అనుకూలం

ఈ మ్యా­చ్‌­కు వే­ది­కైన ఈడె­న్ గా­ర్డె­న్స్పై పిచ్ బ్యా­ట­ర్ల­కు అను­కూ­లం­గా ఉండే అవ­కా­శ­ముం­ది. ఈ టో­ర్నీ­లో తొలి 200 పరు­గుల స్కో­రు కూడా ఇక్క­డే నమో­దైం­ది. స్కా­ట్లాం­డ్ ఇట­లీ­పై 207 పరు­గు­లు చే­సిం­ది. అయి­తే అదే పి­చ్‌­పై ఇటలీ లక్ష్య ఛే­ద­న­లో 134 పరు­గు­ల­కే కు­ప్ప­కూ­లిం­ది. స్పి­న్న­ర్ల­కు టర్న్, పే­స­ర్ల­కు బౌ­న్స్ లభిం­చే ఈ పి­చ్‌­పై సమ­తూక ప్ర­ద­ర్శన అవ­స­రం. బెం­గా­ల్ క్రి­కె­ట్ సంఘం అధ్య­క్షు­డు సౌ­ర­భ్ గం­గూ­లీ పి­చ్‌­ను పరి­శీ­లిం­చి సం­తృ­ప్తి వ్య­క్తం చే­సి­న­ట్లు సమా­చా­రం. మంచు ప్ర­భా­వం కూడా ఉండే అవ­కా­శం ఉంది. అం­దు­వ­ల్ల టాస్ కీలక పా­త్ర పో­షిం­చ­నుం­ది. భా­ర­త్ ఈ ప్ర­పం­చ­క­ప్‌­లో ఈడె­న్ గా­ర్డె­న్స్‌­లో ఆడ­నుం­డ­టం ఇదే తొ­లి­సా­రి. కానీ వె­స్టిం­డీ­స్ మా­త్రం గ్రూ­ప్ దశలో స్కా­ట్లాం­డ్, ఇట­లీ­తో ఇక్క­డే మ్యా­చ్‌­లు ఆడిం­ది. ఆ అను­భ­వం వా­రి­కి కొంత ప్ర­యో­జ­నం కలి­గిం­చే అవ­కా­శం ఉంది. హెట్ మే­య­ర్ వంటి బ్యా­ట­ర్లు ఫా­మ్‌­లో ఉం­డ­డం, బౌ­లిం­గ్ వి­భా­గం క్ర­మ­బ­ద్ధం­గా ఉం­డ­డం వె­స్టిం­డీ­స్ బలం. ఇటు భా­ర­త్, అటు వె­స్టిం­డీ­స్ రెం­డూ దక్షి­ణా­ఫ్రి­కా చే­తి­లో ఓడి­పో­యి, జిం­బా­బ్వే­పై గె­లి­చా­యి. కా­బ­ట్టి ఇరు జట్లు సమాన స్థా­యి­లో­నే ఉన్న­ట్లు కని­పి­స్తు­న్నా­యి.

Tags

Next Story