T20 WORLDCUP: బంగ్లాదేశ్ ఆశలపై ఐసీసీ నీళ్లు

T20 WORLDCUP: బంగ్లాదేశ్ ఆశలపై ఐసీసీ నీళ్లు
X
బంగ్లా అప్పీల్‌ను తిరస్కరించిన ఐసీసీ.. భారత్‌లో మ్యాచులపై ఐసీసీకి ఫిర్యాదు... విచారణ జరుపలేమన్న ఐసీసీ డీఆర్సీ

టీ20 ప్ర­పం­చ­క­ప్‌ మ్యా­చ్‌ల వే­ది­కల మా­ర్పు అం­శం­పై చో­టు­చే­సు­కు­న్న పరి­ణా­మా­లు బం­గ్లా­దే­శ్‌ క్రి­కె­ట్‌ బో­ర్డు (బీ­సీ­బీ)కి తీ­వ్ర ని­రా­శ­ను మి­గి­ల్చా­యి. ఈ వి­ష­యం­లో అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌ మం­డ­లి (ఐసీ­సీ)తో తల­ప­డిన బీ­సీ­బీ­కి వరు­స­గా ఎదు­రు­దె­బ్బ­లు తగు­లు­తు­న్నా­యి. ఇప్ప­టి­కే తమ వి­జ్ఞ­ప్తి­ని ఐసీ­సీ తి­ర­స్క­రిం­చ­గా, తా­జా­గా దా­ఖ­లు చే­సిన అప్పీ­ల్‌ కూడా కొ­ట్టి­వే­య­బ­డ­టం­తో బీ­సీ­బీ ముం­దు దా­రు­లు పూ­ర్తి­గా మూ­సు­కు­పో­యి­న­ట్లు­గా కని­పి­స్తోం­ది. టీ20 ప్ర­పం­చ­క­ప్‌ టో­ర్నీ సం­ద­ర్భం­గా బం­గ్లా­దే­శ్‌ జట్టు ఆడా­ల్సిన మ్యా­చ్‌­ల­ను భా­ర­త్‌­లో­నే ని­ర్వ­హిం­చా­ల­ని ఐసీ­సీ ని­ర్ణ­యిం­చిం­ది. భద్ర­తా, లా­జి­స్టి­క్‌ అం­శా­లు, టో­ర్నీ ని­ర్వ­హ­ణ­లో సమ­న్వ­యం వంటి కా­ర­ణా­ల­ను పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కు­ని ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు ఐసీ­సీ స్ప­ష్టం చే­సిం­ది. అయి­తే ఈ ని­ర్ణ­యా­ని­కి బం­గ్లా­దే­శ్‌ క్రి­కె­ట్‌ బో­ర్డు తీ­వ్ర అభ్యం­త­రం వ్య­క్తం చే­సిం­ది. తమ జట్టు మ్యా­చ్‌­ల­ను వేరే వే­ది­క­కు మా­ర్చా­ల­ని కో­రు­తూ ఐసీ­సీ­కి వి­జ్ఞ­ప్తి చే­సిం­ది. కానీ ఐసీ­సీ బో­ర్డు ఆ వి­జ్ఞ­ప్తి­ని అం­గీ­క­రిం­చ­లే­దు.

ఈ ని­ర్ణ­యా­న్ని సవా­ల్‌ చే­స్తూ బీ­సీ­బీ ఐసీ­సీ వి­వాద పరి­ష్కార కమి­టీ (డీ­ఆ­ర్‌­సీ) వద్ద అప్పీ­ల్‌ దా­ఖ­లు చే­సిం­ది. అయి­తే తా­జా­గా డీ­ఆ­ర్‌­సీ ఈ అప్పీ­ల్‌­ను వి­చా­ర­ణ­కు కూడా స్వీ­క­రిం­చ­కుం­డా తో­సి­పు­చ్చిం­ది. తమ పరి­ధి­లో­కి రాని అం­శం­పై వి­చా­రణ జర­ప­డం సా­ధ్యం కా­ద­ని కమి­టీ స్ప­ష్టం­గా వె­ల్ల­డిం­చిం­ది. ఐసీ­సీ ని­య­మా­వ­ళి ప్ర­కా­రం, అలా­గే డీ­ఆ­ర్‌­సీ ని­బం­ధ­నల ప్ర­కా­రం, ఐసీ­సీ బో­ర్డ్‌ ఆఫ్‌ డై­రె­క్ట­ర్స్‌ తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­ల­పై అప్పీ­ల్‌­ను వి­చా­రిం­చే అధి­కా­రం తమకు లే­ద­ని కమి­టీ తే­ల్చి చె­ప్పిం­ది. దీం­తో బీ­సీ­బీ­కి మరో­సా­రి భారీ షా­క్‌ తగి­లి­న­ట్ల­య్యిం­ది. ఇదే అం­శం­పై గతం­లో జరి­గిన ఓటిం­గ్‌­లో కూడా బీ­సీ­బీ­కి ని­రా­శే ఎదు­రైం­ది.

ఐసీ­సీ బో­ర్డు సభ్యు­లు ని­ర్వ­హిం­చిన ఓటిం­గ్‌­లో 14-2 మె­జా­రి­టీ­తో బం­గ్లా­దే­శ్‌ జట్టు మ్యా­చ్‌­లు భా­ర­త్‌­లో­నే కొ­న­సా­గా­ల­ని తీ­ర్మా­నిం­చా­రు. ఈ ఓటిం­గ్‌­లో ఎక్కువ మంది సభ్యు­లు ఐసీ­సీ ని­ర్ణ­యా­ని­కే మద్ద­తు ఇవ్వ­డం­తో బీ­సీ­బీ వా­ద­న­లు బల­హీ­న­ప­డ్డా­యి. అప్ప­టి నుం­చే ఈ వి­వా­దం మరింత ము­ది­రి­న­ట్లు క్రీ­డా వర్గా­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­యి.డీ­ఆ­ర్‌­సీ ని­ర్ణ­యం వె­లు­వ­డిన నే­ప­థ్యం­లో బీ­సీ­బీ చి­వ­రి ప్ర­య­త్నం­గా న్యా­య­ప­ర­మైన మా­ర్గా­న్ని ఆశ్ర­యిం­చా­ల­నే ఆలో­చ­న­లో ఉన్న­ట్లు సమా­చా­రం. స్వి­ట్జ­ర్లాం­డ్‌­లో­ని **కో­ర్ట్‌ ఆఫ్‌ ఆర్బి­ట్రే­ష­న్‌ ఫర్‌ స్పో­ర్ట్స్‌ (సీ­ఏ­ఎ­స్‌)ను ఆశ్ర­యిం­చా­ల­ని బీ­సీ­బీ భా­వి­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. అం­త­ర్జా­తీయ క్రీ­డా వి­వా­దా­ల్లో సీ­ఏ­ఎ­స్‌ కీలక పా­త్ర పో­షి­స్తుం­డ­టం­తో, అక్క­డై­నా తమకు న్యా­యం జరు­గు­తుం­ద­నే ఆశతో బీ­సీ­బీ ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు సమా­చా­రం.

బం­గ్లా­ స్థా­నం­లో స్కా­ట్లాం­డ్‌ జట్టు­ను బరి­లో­కి దిం­చా­ల­నే అం­శం­పై ఐసీ­సీ ఒక ని­ర్ణ­యా­ని­కి వచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఇప్ప­టి­కే ప్ర­త్యా­మ్నాయ ప్ర­ణా­ళి­క­ల­పై ఐసీ­సీ చర్చ­లు పూ­ర్తి చే­సి­న­ట్లు సమా­చా­రం. ఈ వి­ష­యం­పై శని­వా­రం అధి­కా­రిక ప్ర­క­టన వె­లు­వ­డే అవ­కా­శ­ముం­ద­ని క్రీ­డా వర్గా­లు చె­బు­తు­న్నా­యి. టీ20 ప్ర­పం­చ­క­ప్‌ వే­ది­కల వి­వా­దం బం­గ్లా­దే­శ్‌ క్రి­కె­ట్‌­కు పె­ద్ద సం­క్షో­భం­గా మా­రిం­ది. ఐసీ­సీ తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­ల­కు వ్య­తి­రే­కం­గా పో­రా­డిన బీ­సీ­బీ­కి ఇప్ప­టి­వ­ర­కు ఎక్క­డా అను­కూల ఫలి­తం దక్క­లే­దు. డీ­ఆ­ర్‌­సీ అప్పీ­ల్‌ తి­ర­స్క­ర­ణ­తో బీ­సీ­బీ­కి న్యా­య­ప­ర­మైన మా­ర్గా­లు కూడా పరి­మి­త­మ­య్యా­యి. సీ­ఏ­ఎ­స్‌­నే చి­వ­రి ఆశగా భా­వి­స్తు­న్న బీ­సీ­బీ­కి అక్కడ ఎలాం­టి ఫలి­తం దక్కు­తుం­ద­న్న­ది ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. ఐసీ­సీ కఠిన ని­ర్ణ­యా­లు తీ­సు­కు­నేం­దు­కు సి­ద్ధం­గా ఉం­డ­టం ఈ వి­వా­దా­ని­కి మరింత ప్రా­ధా­న్యం తీ­సు­కొ­చ్చిం­ది.

Tags

Next Story