T20 worldcup: భారత జట్టుకు అచ్చిరాని నరేంద్ర మోదీ పిచ్

T20 worldcup: భారత జట్టుకు అచ్చిరాని నరేంద్ర మోదీ పిచ్
X
ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠ

టీ­మిం­డి­యా ఇప్ప­టి­కే రెం­డు టీ20 వర­ల్డ్ కప్స్ గె­లు­చు­కుం­ది... ఇప్పు­డు ఇంకో ట్రో­ఫీ­కి అడు­గు­దూ­రం­లో ని­లి­చిం­ది. అయి­తే గత వర­ల్డ్ కప్స్ కంటే ఇది చాలా ప్ర­త్యే­క­మై­న­ది... ఎం­దు­కం­టే స్వ­దే­శం­లో, సొంత ప్రే­క్ష­కుల మధ్య ట్రో­ఫీ­ని అం­దు­కో­వ­డం కంటే గొ­ప్ప­ద­నం ఇం­కే­ముం­టుం­ది. అం­దు­కే ఎట్టి పరి­స్థి­తు­ల్లో నేడు జరి­గే ఫై­న­ల్లో న్యూ­జి­లాం­డ్ ను చి­త్తు­చే­యా­ల­నే పట్టు­ద­ల­తో ఉంది టీ­మిం­డి­యా... ఇం­దు­కో­సం వ్యూ­హా­లు రచి­స్తోం­ది. అయి­తే టీ20 వర­ల్డ్ కప్ ఫై­న­ల్ అహ్మ­దా­బా­ద్ నరేం­ద్ర మోదీ స్టే­డి­యం­లో జరు­గు­తుం­డ­టం టీ­మిం­డి­యా అభి­మా­ను­ల­ను కా­స్త ఆం­దో­ళ­న­కు గు­రి­చే­స్తోం­ది. ఈ స్టే­డి­యం భారత జట్టు­కు పె­ద్ద­గా అచ్చి­రా­లే­దు. ఐసి­సి వన్డే వర­ల్డ్ కప్ 2023 ఫై­న­ల్ ఇదే స్టే­డి­యం­లో జరి­గిం­ది.. టో­ర్నీ మొ­త్తం ఓట­మ­న్న­దే లే­కుం­డా ఫై­న­ల్ కు చే­రిం­ది భారత జట్టు... కానీ ఈ మోదీ స్టే­డి­యం­లో ఆస్ట్రే­లి­యా­తో ఓడిం­ది. దీం­తో మరో వన్డే వర­ల్డ్ కప్ ఆశలు ఆవి­ర­య్యా­యి.

ఇక ఈ టీ20 వర­ల్డ్ కప్ లో కూడా టీ­మిం­డి­యా కే­వ­లం ఒకే ఒక్క మ్యా­చ్ ఓడిం­ది... అదీ ఈ అహ్మ­దా­బా­ద్ స్టే­డి­యం­లో­నే. గ్రూ­ప్-8 స్టే­జ్ లో సౌ­తా­ఫ్రి­కా చే­తి­లో ఘోర ఓట­మి­ని చవి­చూ­సిన టీ­మిం­డి­యా­కు సె­మీ­స్ అవ­కా­శా­ల­ను సం­క్లి­ష్టం­గా మా­రా­యి... ఆ తర్వాత జిం­బా­బ్వే, వె­స్టిం­డి­స్ ను ఓడిం­చి సె­మీ­స్ కు చే­రిం­ది. నరేం­ద్ర మోదీ స్టే­డి­యం­లో టీ­మిం­డి­యా ఓట­ముల నే­ప­థ్యం­లో టీ20 వర­ల్డ్ కప్ ఫై­న­ల్ ఎలా ఉటుం­ద­న్న­ది ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. ఈ సెం­టి­మెం­ట్ ను భారత జట్టు మా­రు­స్తుం­దా.. లేక కొ­న­సా­గి­స్తుం­దా? అన్న­ది నేడు . మరి ఈ మోదీ స్టే­డి­యం పిచ్ ఎలా ఉం­టుం­ది..? ఎవ­రి­కి సహ­క­రి­స్తుం­దనేది చూ­డా­లి.

భారత గడ్డ­పై జరి­గిన మ్యా­చ్‌­ల్లో టీ­మ్ఇం­డి­యా­నే ఎక్కువ వి­జ­యా­లు సా­ధిం­చిం­ది. స్వ­దే­శం­లో భా­ర­త్‌ 11 మ్యా­చ్‌­ల్లో గె­లి­చిం­ది. అదే సమ­యం­లో కి­వీ­స్‌ జట్టు నా­లు­గు మ్యా­చ్‌­ల్లో మా­త్ర­మే వి­జ­యం సా­ధిం­చిం­ది. అయి­తే న్యూ­జి­లాం­డ్‌ గడ్డ­పై కూడా భా­ర­త్‌ మంచి ప్ర­ద­ర్శన కన­బ­రి­చిం­ది. అక్కడ భా­ర­త్‌ ఏడు మ్యా­చ్‌­ల్లో వి­జ­యం సా­ధిం­చ­గా, న్యూ­జి­లాం­డ్‌ ఐదు మ్యా­చ్‌­ల్లో గె­లి­చిం­ది. తట­స్థ వే­ది­క­ల్లో జరి­గిన మ్యా­చ్‌­ల్లో మా­త్రం కి­వీ­స్‌ జట్టు రెం­డు వి­జ­యా­లు నమో­దు చే­సిం­ది. టీ20 ప్ర­పం­చ­క­ప్‌ టో­ర్నీ­ల­లో మా­త్రం కథ కొం­చెం భి­న్నం­గా ఉంది. ఇప్ప­టి­వ­ర­కు జరి­గిన టీ20 ప్ర­పం­చ­క­ప్‌­ల్లో భా­ర­త్‌, న్యూ­జి­లాం­డ్‌ మూడు సా­ర్లు తల­ప­డ్డా­యి. ఆ మూడు సం­ద­ర్భా­ల్లో­నూ వి­జ­యం న్యూ­జి­లాం­డ్‌­కే దక్కిం­ది. ఈ రి­కా­ర్డు టీ­మ్ఇం­డి­యా­కు కొంత ఒత్తి­డి­ని కలి­గిం­చే అం­శ­మే. ప్ర­పం­చ­క­ప్‌­ల్లో కి­వీ­స్‌­పై భా­ర­త్‌­కు వి­జ­యం దక్క­లే­దు.

Tags

Next Story