T20 WORLD CUP: పాకిస్థాన్ నాటకాలు మళ్లీ షురూ

T20 WORLD CUP: పాకిస్థాన్ నాటకాలు మళ్లీ షురూ
X
మళ్లీ డ్రామా మొదలుపెట్టిన పాక్ జట్టు... భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ ప్రకటన... మళ్లీ ఇండియాతో ఆడేందుకు చర్చలు

టీ20 వరల్డ్‌కప్‌ 2026 టోర్నమెంట్‌ విషయంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక దశలో టోర్నమెంట్‌కే దూరంగా ఉంటామంటూ సంచలన ప్రకటనలు చేసిన పాకిస్తాన్‌, ఆపై భారత్‌తో మ్యాచ్‌ ఆడబోమని బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా పరిణామాలతో ఆ వైఖరికి పూర్తిగా భిన్నంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సంకేతాలు రావడంతో, ఈ మెగా టోర్నీలో అభిమానులు ఎదురుచూస్తున్న హై-వోల్టేజ్‌ భారత్‌–పాకిస్తాన్‌ పోరు జరిగే అవకాశాలు మళ్లీ బలపడుతున్నాయి.

మారిన స్వరం

టీ20 వర­ల్డ్‌­క­ప్‌ 2026 ని­ర్వ­హ­ణ­పై మొ­ద­టి నుం­చే పా­కి­స్తా­న్‌ అసం­తృ­ప్తి వ్య­క్తం చే­స్తూ వచ్చిం­ది. భద్ర­తా కా­ర­ణా­లు, రా­జ­కీయ అం­శా­ల­ను తె­ర­పై­కి తె­చ్చిన పా­కి­స్తా­న్‌—ఒక దశలో అసలు టో­ర్న­మెం­ట్‌­లో పా­ల్గొ­న­బో­మ­న్న వా­ద­న­ను కూడా ముం­దు­కు తీ­సు­కొ­చ్చిం­ది. ఆ తర్వాత కొ­లం­బో­కు వచ్చి టో­ర్న­మెం­ట్‌­లో ఆడ­తా­మ­ని ప్ర­క­టిం­చ­డం ద్వా­రా ఒక్క­సా­రి­గా అం­ద­రి­నీ ఆశ్చ­ర్యా­ని­కి గు­రి­చే­సిం­ది. కానీ ఇదే సమ­యం­లో మరో సం­చ­లన ని­ర్ణ­యం వె­లు­గు­లో­కి వచ్చిం­ది. టో­ర్న­మెం­ట్‌­లో పా­ల్గొం­టాం గానీ, భా­ర­త్‌ లాం­టి బల­మైన జట్టు­తో మా­త్రం ఆడ­బో­మం­టూ పా­కి­స్తా­న్‌ క్రి­కె­ట్‌ బో­ర్డు స్ప­ష్టం చే­సిం­ది. ఈ ని­ర్ణ­యా­ని­కి రా­జ­కీయ రంగు కూడా అద్దు­తూ, భారత జట్టు బం­గ్లా­దే­శ్‌ వి­ష­యం­లో దౌ­ర్జ­న్యం­గా వ్య­వ­హ­రి­స్తోం­ద­న్న ఆరో­ప­ణ­ల­ను తె­ర­పై­కి తీ­సు­కొ­చ్చా­రు. ఈ అంశంపై పాకిస్తాన్‌ ప్రధాని **షరీఫ్** కూడా అధికారికంగా స్పందించారు. వీడియో సందేశం ద్వారా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో, ఈ వివాదం క్రికెట్‌ స్థాయిని దాటి రాజకీయ స్థాయికి చేరింది.

ఐసీసీ హెచ్చరికలతో మారిన దిశ

పా­కి­స్తా­న్‌ తీ­సు­కు­న్న ఈ ని­ర్ణ­యం­పై అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ కౌ­న్సి­ల్ (ఐసీ­సీ) తీ­వ్రం­గా స్పం­దిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. టో­ర్న­మెం­ట్‌ షె­డ్యూ­ల్‌­ను అతి­క్ర­మి­స్తే భారీ జరి­మా­నా­లు, భవి­ష్య­త్‌ అం­త­ర్జా­తీయ టో­ర్న­మెం­ట్ల­లో ఆం­క్ష­లు, ద్వై­పా­క్షిక సి­రీ­స్‌­ల­పై ని­షే­ధం వి­ధిం­చే అవ­కా­శం ఉం­దం­టూ ఐసీ­సీ వరు­స­గా హె­చ్చ­రి­క­లు జారీ చే­సి­న­ట్లు సమా­చా­రం. ఈ హె­చ్చ­రి­కల ప్ర­భా­వం­తో పా­కి­స్తా­న్‌ క్రి­కె­ట్‌ బో­ర్డు వె­న­క్కి తగ్గి­న­ట్లు పా­క్‌ జా­తీయ మీ­డి­యా కథ­నా­లు వె­లు­వ­డు­తు­న్నా­యి. బహి­ష్క­రణ ని­ర్ణ­యా­న్ని పక్కన పె­ట్టి, భా­ర­త్‌­తో మ్యా­చ్‌ ఆడే ది­శ­గా మళ్లీ ఐసీ­సీ­తో చర్చ­లు ప్రా­రం­భిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. భా­ర­త్‌­తో వి­వా­దా­ని­కి వె­ళ్ల­కుం­డా, సా­మ­ర­స్య­పూ­ర్వ­కం­గా మ్యా­చ్‌ ని­ర్వ­హ­ణ­కు సహ­క­రి­స్తా­మ­ని పా­కి­స్తా­న్‌ బో­ర్డు కొ­త్త వా­ద­న­ను ముం­దు­కు తె­చ్చిం­ద­ని సమా­చా­రం.

శ్రీలంక బోర్డు ఒత్తిడి

ఈ మొ­త్తం వ్య­వ­హా­రం­లో కీలక పా­త్ర పో­షి­స్తు­న్న­ది శ్రీ­లంక క్రి­కె­ట్‌ బో­ర్డు. భా­ర­త్‌–పా­కి­స్తా­న్‌ మ్యా­చ్‌ రద్ద­యి­తే తమకు భారీ ఆర్థిక నష్టం వా­టి­ల్లు­తుం­ద­ని లంక బో­ర్డు స్ప­ష్టం­గా పే­ర్కొం­ది. ఇప్ప­టి­కే వా­ణి­జ్య ఒప్పం­దా­లు, ప్ర­సార హక్కు­లు, స్పా­న్స­ర్‌ డీ­ల్స్‌, భద్ర­తా ఏర్పా­ట్లు పూ­ర్త­యిన నే­ప­థ్యం­లో ఈ మ్యా­చ్‌ జర­గ­క­పో­తే కో­ట్ల రూ­పా­యల నష్టం తప్ప­ద­ని హె­చ్చ­రిం­చిం­ది.

Tags

Next Story