T20 WORLD CUP: బ్యాటర్‌గా నిలిచాడు... సారధిగా నడిపించాడు

T20 WORLD CUP: బ్యాటర్‌గా నిలిచాడు... సారధిగా నడిపించాడు
X
తొలి మ్యాచ్‌లో సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్... సూర్య లేకపోతే భారత్ గెలుపు కష్టమే... క్లిష్ట పరిస్థితుల్లో సూర్య సూపర్ ఇన్నింగ్స్

టీ 20 ప్ర­పం­చ­క­ప్ లో భా­ర­త్ తొలి మ్యా­చ్ గె­లి­చిన తరు­వాత ప్ర­తి భారత క్రి­కె­ట్‌ అభి­మా­ని­ని ఒకే ప్ర­శ్న వెం­టా­డిం­ది. “ఈ మ్యా­చ్‌­లో సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ లే­క­పో­తే పరి­స్థి­తి ఏమ­య్యే­ది?” అని. అది కే­వ­లం ఊహ కాదు… వా­స్త­వా­ని­కి చాలా దగ్గ­ర­గా ఉన్న ప్ర­మా­దం. కె­ప్టె­న్‌ సూ­ర్య కీలక ఇన్నిం­గ్స్ ఆడ­క­పో­యి ఉంటే, టీ20 ప్ర­పం­చ­క­ప్‌­లో భా­ర­త్‌ తొలి మ్యా­చ్‌­లో­నే ఘోర పరా­జ­యా­న్ని చవి­చూ­సే­ద­న్న అభి­ప్రా­యం ఇప్పు­డు వి­శ్లే­ష­కుల మధ్య బలం­గా వి­ని­పి­స్తోం­ది. ప్ర­పం­చ­క­ప్‌ లాం­టి మెగా టో­ర్నీ­లో తొలి మ్యా­చ్‌ చాలా కీ­ల­కం. అటు­వం­టి సం­ద­ర్భం­లో భారత బ్యా­టిం­గ్‌ లై­న­ప్‌ ఒక­దా­ని తరు­వాత ఒకటి కు­ప్ప­కూ­లు­తు­న్న వేళ, ఇన్నిం­గ్స్‌­ను కా­పా­డు­తూ జట్టు­కు పో­టీ­త­త్వ స్కో­రు అం­దిం­చిన వ్య­క్తి ఒక్క సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ మా­త్ర­మే. ఈ ఇన్నిం­గ్స్‌ అతడి కె­రీ­ర్‌­లో­నే అత్యు­త్తమ ఇన్నిం­గ్స్‌­ల­లో ఒక­టని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సూర్య ఫామ్‌పై సందేహాలు

ని­జా­ని­కి, నెల రో­జుల క్రి­తం వరకు సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌ భారత జట్టు­లో కొ­న­సా­గ­డ­మే కాదు, కె­ప్టె­న్‌­గా కొ­న­సా­గ­డం­పై­నా పె­ద్ద ఎత్తున ప్ర­శ్న­లు వచ్చా­యి. ఏడా­ది­న్నర క్రి­తం టీ­మ్‌­ఇం­డి­యా పగ్గా­లు చే­ప­ట్టిన సూ­ర్య, ఆరం­భం­లో రెం­డు మూడు మె­రు­పు ఇన్నిం­గ్స్‌­లు ఆడి ఆక­ట్టు­కు­న్నా­డు. కానీ ఆ తర్వాత అతడు ఫామ్ కో­ల్పో­యి పరు­గు­లు చే­సేం­దు­కు తీ­వ్ర ఇబ్బం­ది పడ్డా­డు. వరు­స­గా 26 ఇన్నిం­గ్స్‌­ల­పా­టు అర్ధ­శ­త­కం సా­ధిం­చ­లే­క­పో­వ­డం అత­డి­పై వి­మ­ర్శ­ల­కు తా­వి­చ్చిం­ది. ఒక­ప్పు­డు ప్ర­పం­చం­లో­నే అత్యంత ప్ర­మా­ద­క­ర­మైన టీ20 బ్యా­ట్స్‌­మ­న్‌­గా పేరు తె­చ్చు­కు­న్న సూ­ర్య, అదే ఫా­ర్మా­ట్‌­లో తడ­బ­డ­టం జట్టు­కు భా­రం­గా మా­రు­తు­న్నా­డ­న్న అభి­ప్రా­యం కూడా వ్య­క్త­మైం­ది. “ఫా­మ్‌ లేని ఆట­గా­డి­ని కె­ప్టె­న్‌­గా కొ­న­సా­గిం­చ­డం సరి­కా­దా?” అన్న చర్చ సె­ల­క్ట­ర్ల స్థా­యి వరకూ వె­ళ్లిం­ది.

సారథ్యంలో తిరుగులేదు

వ్య­క్తి­గత ఫా­మ్‌ ఎలా ఉన్నా, సూ­ర్య నా­య­క­త్వం­లో భా­ర­త్‌ వరు­స­గా సి­రీ­స్‌­లు గె­లు­స్తూ రా­వ­డం సె­ల­క్ట­ర్ల­కు అత­డి­పై నమ్మ­కా­న్ని పెం­చిం­ది. ప్ర­పం­చ­క­ప్‌ దగ్గ­ర­ప­డు­తు­న్న వేళ కె­ప్టె­న్‌­ను మా­ర్చ­డం జట్టు­పై ప్ర­తి­కూల ప్ర­భా­వం చూ­పు­తుం­ద­న్న భా­వ­న­తో అత­డి­నే కొ­న­సా­గిం­చా­రు. ఆ ని­ర్ణ­యా­ని­కి న్యా­యం చే­స్తూ సూ­ర్య, ప్ర­పం­చ­క­ప్‌­కు ముం­దే ఫా­మ్‌­లో­కి వచ్చా­డు. న్యూ­జి­లాం­డ్‌­తో జరి­గిన సి­రీ­స్‌­లో వరు­స­గా మూడు అద్భు­త­మైన అర్ధ­శ­త­కా­లు సా­ధిం­చి, “తాను ఇంకా ము­గి­సి­పో­లే­ద­ని” స్ప­ష్టం­గా ని­రూ­పిం­చా­డు. ఆ సి­రీ­స్‌ నుం­చి అతడి బ్యా­టిం­గ్‌­లో మళ్లీ పాత ఆత్మ­వి­శ్వా­సం కని­పిం­చిం­ది.

ప్ర­పం­చ­క­ప్‌ తొలి మ్యా­చ్‌­లో అదే ఆత్మ­వి­శ్వా­సా­న్ని సూ­ర్య కొ­న­సా­గిం­చా­డు. ఇన్నిం­గ్స్‌ ఆరం­భం నుం­చే భారత జట్టు వి­కె­ట్లు కో­ల్పో­తుం­డ­గా, మరో­వై­పు ఒత్తి­డి నా­నా­టి­కీ పె­రు­గు­తోం­ది. అటు­వం­టి సమ­యం­లో తన వి­కె­ట్‌­ను కా­పా­డు­కుం­టూ­నే పరు­గు­లు సా­ధిం­చ­డం అంత తే­లి­కైన పని కాదు. కానీ సూ­ర్య ఎంతో పరి­ణ­తి­తో బ్యా­టిం­గ్‌ చే­శా­డు. అవ­స­ర­మైన చోట రి­స్క్‌ తీ­సు­కు­న్నా­డు, అవ­స­రం లేని చోట పూ­ర్తి­గా ఆపే­శా­డు. చి­వ­రి ఓవ­ర్ల­లో ఒక్క షా­ట్‌ తేడా కొ­ట్టి­నా భారత స్కో­రు మరింత ది­గ­జా­రి­పో­యే­ది. కానీ సూ­ర్య ఏ దశ­లో­నూ తొం­ద­ర­ప­డ­లే­దు. సూ­ర్య స్కూ­ప్‌ షా­ట్ల­లో ఉన్న నై­పు­ణ్యం ప్ర­పం­చా­ని­కి తె­లి­సిం­దే. అదే కా­ర­ణం­గా అమె­రి­కా బౌ­ల­ర్లు అత­డి­కి లె­గ్‌­సై­డ్‌ ఇవ్వ­కుం­డా, ఆఫ్‌­సై­డ్‌­కే బం­తు­లు వే­యా­ల­ని వ్యూ­హం రచిం­చా­రు. కానీ సూ­ర్య అంత సు­లు­వు­గా చి­క్క­లే­దు. ఫై­న్‌ లె­గ్‌­లో తన మా­ర్కు షా­ట్లు, కచ్చి­త­మైన స్వీ­ప్‌­లతో ఉర్రూ­త­లూ­గిం­చా­యి.

Tags

Next Story