T20 WORLD CUP: ప్రపంచకప్ వేట విజయంతో మొదలు

T20 WORLD CUP: ప్రపంచకప్ వేట విజయంతో మొదలు
X
అమెరికాపై టీమిండియా విజయం... పోరాడిన యూఎస్ఏ జట్టు... 29 రన్స్ తేడాతో భారత్ గెలుపు... రాణించీన సూర్యకుమార్ యాదవ్

ఐసీ­సీ టీ20 వర­ల్డ్‌­క­ప్ 2026 టై­టి­ల్ వే­ట­ను భా­ర­త్ వి­జ­యం­తో ఆరం­భిం­చిం­ది. ముం­బై­లో­ని వాం­ఖ­డే స్టే­డి­యం వే­ది­క­గా జరి­గిన ఈ మ్యా­చ్‌­లో అమె­రి­కా జట్టు­ను 29 పరు­గుల తే­డా­తో ఓడిం­చిం­ది.కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ అద్భుత ఇన్నిం­గ్స్‌­తో జట్టు­ను ఆదు­కో­గా, అనం­త­రం భారత బౌ­ల­ర్లు సమ­ష్టి­గా రా­ణిం­చి వి­జ­యం­లో ప్ర­ధాన పా­త్ర పో­షిం­చా­రు. ఈ మ్యా­చ్‌­లో టాస్ గె­లి­చిన అమె­రి­కా కె­ప్టె­న్ మో­నాం­క్ పటే­ల్ ముం­దు­గా బౌ­లిం­గ్ ఎం­చు­కు­న్నా­డు. యూ­ఎ­స్ఏ పేస్ బౌ­ల­ర్లు భారత బ్యా­టిం­గ్‌­ను తీ­వ్రం­గా ఇబ్బం­ది పె­ట్టా­రు. ఓపె­న­ర్లు­గా బరి­లో­కి ది­గిన అభి­షే­క్ శర్మ, శి­వ­మ్ దుబే ఇద్ద­రూ ఖాతా తె­ర­వ­కుం­డా­నే గో­ల్డె­న్ డక్‌­గా వె­ను­ది­ర­గ­డం టీ­మిం­డి­యా­కు గట్టి షాక్ ఇచ్చిం­ది. ఆ తర్వాత వచ్చిన ఇషా­న్ కి­ష­న్, తి­ల­క్ వర్మ కూడా భారీ స్కో­రు చే­య­లేక తక్కువ పరు­గు­ల­కే ఔట­య్యా­రు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

టాప్ ఆర్డ­ర్ పూ­ర్తి­గా కు­ప్ప­కూ­లిన వేళ రిం­కూ సిం­గ్, హా­ర్ది­క్ పాం­డ్యా, అక్ష­ర్ పటే­ల్‌­ల­పై ఆశలు పె­ట్టు­కు­న్న అభి­మా­ను­ల­కు ని­రా­శే ఎదు­రైం­ది. వీ­రం­తా ఒక్కొ­క్క­రు­గా పె­వి­లి­య­న్ చే­ర­డం­తో భారత జట్టు ఒక దశలో తీ­వ్ర ఒత్తి­డి­లో పడిం­ది. అయి­తే ఈ క్లి­ష్ట సమ­యం­లో కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ క్రీ­జ్‌­కు అం­టి­పె­ట్టు­కు­ని ని­ల­బ­డి బా­ధ్య­తా­యు­త­మైన ఇన్నిం­గ్స్ ఆడా­డు. తొ­లుత బ్యా­టిం­గ్ చే­సిన భారత జట్టు కె­ప్టె­న్ సూ­ర్య కు­మా­ర్ యా­ద­వ్ అద్భుత ఇన్నిం­గ్స్‌­తో 161-9 పరు­గు­లు చే­సిం­ది. 162 పరు­గు­ల­తో బరి­లో­కి ది­గిన యూ­ఎ­స్ఏ­ను భారత జట్టు 132 పరు­గు­ల­కు కట్ట­డి చే­సిం­ది. దాం­తో టీ­మిం­డి­యా 29 పరు­గుల తే­డా­తో వి­జ­యం సా­ధిం­చిం­ది. కె­ప్టె­న్ సూ­ర్య కు­మా­ర్ యా­ద­వ్ ఆఖరి వరకూ ని­ల­బ­డి ఒం­ట­రి పో­రా­టం­తో 84 పరు­గు­లు చేసి జట్టు స్కో­ర్‌­ను 161కి తీ­సు­కె­ళ్లా­డు.

రాణించిన బౌలర్లు

162 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన యూ­ఎ­స్ఏ జట్టు­ను టీ­మిం­డి­యా పే­స­ర్లు ఆరం­భం­లో­నే దె­బ్బ తీ­శా­రు. ఆఖరి ని­మి­షం­లో జట్టు­లో­కి వచ్చిన మొ­హ­మ్మ­ద్ సి­రా­జ్ అద్భుత బౌ­లిం­గ్‌­తో ఆక­ట్టు­కు­న్నా­డు. అర్ష్‌­దీ­ప్ సిం­గ్ కూడా రా­ణిం­చ­డం­తో యూ­ఎ­స్ఏ జట్టు కే­వ­లం 13 పరు­గు­ల­కే మూడు కీలక వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. పవర్‌ప్లేలోనే అమెరికా జట్టు కేవలం 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సిరాజ్, అర్ష్‌దీప్ ఇద్దరూ కలిసి తొలి ఆరు ఓవర్లను పూర్తిగా నియంత్రించడంతో యూఎస్ఏ బ్యాటర్లు పరుగులు తీయలేకపోయారు. నాలుగు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయిన అమెరికా జట్టును మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి కొంతవరకు ఆదుకున్నారు.

నా­లు­గు ఓవ­ర్ల­కే మూడు వి­కె­ట్లు కో­ల్పో­యిన జట్టు­ను మి­లిం­ద్ కు­మా­ర్ - సం­జ­య్ కృ­ష్ణ­మూ­ర్తి ముం­దు­కు తీ­సు­కె­ళ్లా­రు. ఈ ఇద్ద­రూ కలి­సి నా­లు­గో వి­కె­ట్‌­కు 58 పరు­గుల భా­గ­స్వా­మ్యం నె­ల­కొ­ల్పా­రు. 34 బం­తు­ల్లో మూడు ఫో­ర్లు, 1 సి­క్స­ర్‌­తో 34 పరు­గు­లు చే­సిన మి­లిం­ద్ కు­మా­ర్ వరు­ణ్ చక్ర­వ­ర్తి బౌ­లిం­గ్‌­లో స్టం­ప్ అవు­ట్ అయ్యా­డు. దాం­తో 12 ఓవ­ర్ల­కు యూ­ఎ­స్ఏ 71 పరు­గు­ల­కు నా­లు­గు వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది.అప్ప­టి­కే మ్యా­చ్ చే­జా­రి­పో­యి­న­ప్ప­టి­కీ సం­జ­య్ కృ­ష్ణ­మూ­ర్తి కా­సే­పు పో­రా­డా­డు. ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో అమె­రి­కా జట్టు 8 వి­కె­ట్ల నష్టా­ని­కి 132 పరు­గు­ల­కే పరి­మి­త­మైం­ది. దీం­తో భా­ర­త్ 29 పరు­గుల తే­డా­తో ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది.

Tags

Next Story