T20 WORLDCUP: విండీస్ విజయం.. భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టం

T20 WORLDCUP: విండీస్ విజయం.. భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టం
X
జింబాబ్వే బౌలర్లను చితక్కొట్టిన విండీస్.. 20 ఓవర్లలో 254 రన్స్ చేసిన వెస్టిండీస్... 107 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే

టీ20 ప్రపంచ కప్ 2026లో జింబాబ్వేతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కొండంత లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో వచ్చిన బ్రాడ్ ఇవాన్స్ (43; 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మాత్రమే పోరాడాడు. డియోన్ మైయర్స్ (28), సికిందర్ రజా (27), మరుమాని (14), టోనీ మున్యాంగా (14) పరుగులు చేశారు. ఒక దశలో జింబాబ్వే 103 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా ఇవాన్స్ మెరుపులు మెరిపించడంతో స్కోరు 140 దాటింది. కరేబియన్ జట్టు బౌలర్లలో గుడాకేష్ మోటి 4, అకిల్ హోస్సేన్ 3, మాథ్యూ ఫోర్డ్ 2, జేసన్ హోల్డర్ ఒక వికెట్ పడగొట్టారు. విం­డీ­స్ బ్యా­ట­ర్ల­లో షి­మ్రో­న్ హె­ట్‌­మ­యె­ర్ (85; 34 బం­తు­ల్లో 7 ఫో­ర్లు, 7 సి­క్స్‌­లు), రో­వ్‌­మ­న్ పా­వె­ల్ (59; 35 బం­తు­ల్లో 4 ఫో­ర్లు, 4 సి­క్స్‌­లు) హా­ఫ్‌ సెం­చ­రీ­లు సా­ధిం­చా­రు. ఆఖ­ర్లో షె­ర్ఫా­నె రూ­థ­ర్‌­ఫో­ర్డ్ (31; 13 బం­తు­ల్లో 2 ఫో­ర్లు, 1 సి­క్స్‌), రొ­మా­రి­యో షె­ఫ­ర్డ్ (21: 10 బం­తు­ల్లో 3 సి­క్స్‌­లు), జా­స­న్ హో­ల్డ­ర్ (13; 4 బం­తు­ల్లో 2 సి­క్స్‌­లు) దూ­కు­డు­గా ఆడా­రు. ఓపె­న­ర్లు బ్రాం­డ­న్ కిం­గ్ (9), షై హోప్ (14) వి­ఫ­ల­మ­య్యా­రు. జిం­బా­బ్వే బౌ­ల­ర్ల­లో ఎన్‌­గ­ర­వా 2, ము­జ­ర­బా­ని 2, బ్రా­డ్ ఇవా­న్స్, క్రె­మె­ర్ చెరో వి­కె­ట్‌ తీ­శా­రు. 255 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన జిం­బా­బ్వే ఆరం­భం నుం­చే ఒత్తి­డి­లో పడిం­ది. కీలక బ్యా­ట­ర్లు వరు­స­గా ఔట­వ­డం­తో 103 పరు­గు­ల­కే 9 వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. ఎని­మి­దో స్థా­నం­లో వచ్చిన బ్రా­డ్ ఇవా­న్స్ 21 బం­తు­ల్లో 43 పరు­గు­లు (2 ఫో­ర్లు, 5 సి­క్స్‌­లు) చేసి పో­రా­డి­నా ఫలి­తం మా­ర­లే­దు

విం­డీ­స్‌ ఇన్నిం­గ్స్‌­లో వచ్చిన ప్ర­తి బ్యా­ట­రూ దూ­కు­డే మం­త్రం­గా ఆడా­రు. సి­క్స్‌ల వర్షం కు­రి­పిం­చా­రు. విం­డీ­స్‌ బ్యా­ట­ర్లు మొ­త్తం­గా 19 సి­క్స్‌­లు కొ­ట్టా­రు. అం­దు­లో రెం­డు­సా­ర్లు లై­ఫ్‌ దొ­రి­కిన హె­ట్‌­మ­యె­ర్‌­వే 7 సి­క్స్‌­లు ఉన్నా­యి. టీ20 ప్ర­పంచ కప్‌­లో అత్యంత వే­గ­వం­త­మైన హా­ఫ్‌ సెం­చ­రీ చే­సిన బ్యా­ట­ర్‌­గా హె­ట్‌­మ­యె­ర్ రి­కా­ర్డు సృ­ష్టిం­చా­డు. మరో 15 పరు­గు­లు చేసి ఉంటే.. టీ20 ప్ర­పంచ కప్‌­లో­నే ఫా­స్టె­స్ట్‌ సెం­చ­రీ చే­సిన క్రి­కె­ట­ర్‌­గా రి­కా­ర్డు సృ­ష్టిం­చే­వా­డు. కానీ, 85 పరు­గుల వద్ద పె­వి­లి­య­న్‌­కు చే­రా­డు. ఈ వర­ల్డ్‌ కప్‌­లో అత్య­ధిక స్కో­రు ఇదే కా­వ­డం గమ­నా­ర్హం.

గేల్ రికార్డుకు హెట్‌మయెర్ సవాల్

టీ20 ప్ర­పం­చ­క­ప్ చరి­త్ర­లో వే­గ­వం­త­మైన సెం­చ­రీ 47 బం­తు­ల్లో సా­ధిం­చిన క్రి­స్ గేల్ పే­రిట ఉంది. ఈ మ్యా­చ్‌­లో హె­ట్‌­మ­యె­ర్ అదే ది­శ­గా దూ­సు­కె­ళ్లి­నా, 85 పరు­గుల వద్ద ఔట­వ­డం­తో ఆ చరి­త్రా­త్మక ఘట్టం దూ­ర­మైం­ది. అయి­న­ప్ప­టి­కీ అతని 19 బం­తుల హాఫ్ సెం­చ­రీ ఈ టో­ర్నీ­లో­నే కా­కుం­డా విం­డీ­స్ తర­ఫున ప్ర­పం­చ­క­ప్‌­లో అత్యంత వే­గ­వం­త­మైన అర్ధ­శ­త­కం­గా ని­లి­చిం­ది.

సూపర్-8లో విండీస్ గర్జన

సూ­ప­ర్-8 దశలో ఇంత భారీ స్కో­రు నమో­దు చే­య­డం విం­డీ­స్ ఆత్మ­వి­శ్వా­సా­న్ని తె­లి­య­జే­స్తోం­ది. బౌ­లిం­గ్, బ్యా­టిం­గ్ రెం­డిం­టి­లో­నూ సమ­తూక ప్ర­ద­ర్శ­న­తో 107 పరు­గుల ఘన వి­జ­యం సా­ధిం­చా­రు. ఈ ఫలి­తం­తో సె­మీ­స్ రే­సు­లో తమ స్థా­నా­న్ని బల­ప­రి­చా­రు. మొ­త్తా­ని­కి, “రా­వ­డం.. బా­ద­డం.. గె­ల­వ­డం” అన్న ఫా­ర్ము­లా­తో విం­డీ­స్ ఈ మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా ఏక­ప­క్షం­గా మా­ర్చిం­ది. హె­ట్‌­మ­యె­ర్ తు­ఫా­న్ ఇన్నిం­గ్స్, పా­వె­ల్ తో­డ్పా­టు, చి­వ­ర్లో ఫి­ని­ష­ర్ల దూ­కు­డుతో విండీస్ భారీ స్కోరు చేసింది.

Tags

Next Story