T20 WORLDCUP: మెగా టోర్నీకి దూరమైన స్టార్లు

టీ 20 ప్రపంచ కప్ 2026 కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అందులో శుభమన్ గిల్, రిషబ్ పంత్ లాంటి కీలక ఆటగాళ్లు లేరు. గిల్‌తో పాటు, టీ20 ప్రపంచ కప్ జట్టు నుండి పలు స్టార్ క్రికెటర్లు కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
గిల్ - 2026 టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ నుండి దూరమైన అతిపెద్ద పేరు శుభమన్ గిల్. ఈ ఏడాది ఆగస్టు 2025లో T20 జట్టులోకి తిరిగి వచ్చినప్పటి నుండి గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. దురదృష్టవశాత్తూ గత కొన్ని మ్యాచ్‌లలో గిల్ T20 ఫామ్ చాలా పేలవంగా ఉంది. ఈ ఏడాది ఆడిన T20 మ్యాచ్‌లలో గిల్ ఒక్క అర్ధశతకం కూడా చేయలేదు.
పంత్ - టీ20 వరల్డ్ కప్ జట్టులో కనిపించని రెండవ పెద్ద పేరు రిషబ్ పంత్. అతను టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ అయినప్పటికీ T20 స్క్వాడ్‌లో రెగ్యులర్‌గా సభ్యుడు కాదు. వికెట్ కీపర్‌గా సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లకు 2026 టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లో స్థానం లభించింది. పంత్ లేకపోవడంతో శాంసన్‌కు ప్లేయింగ్ XIలో చోటు దక్కింది.
జైస్వాల్ - 2024 T20 ప్రపంచ కప్ ఛాంపియన్ ఇండియా జట్టులో యశస్వి జైస్వాల్ భాగంగా ఉన్నాడు. అంతర్జాతీయ T20 క్రికెట్లో 36 సగటు, 164.31 స్ట్రైక్ రేట్‌తో ఉన్నప్పటికీ జైస్వాల్‌కు జట్టులో స్థానం దక్కలేదు.
మహ్మద్ సిరాజ్ - మహ్మద్ సిరాజ్ చివరిసారిగా జనవరి 2025లో భారత్ తరపున అంతర్జాతీయ T20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్‌గా T20 జట్టులో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ కోసం పేస్ అటాక్ బాధ్యతను BCCI జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు అప్పగించింది.
జితేష్ శర్మ - జితేష్ శర్మ కూడా టీ20 వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలపై T20 సిరీస్‌లలో సంజు శాంసన్ బెంచ్‌పై కూర్చున్నా వికెట్ కీపర్‌గా జితేష్ శర్మ ఆడాడు. వరుసగా 2 సిరీస్‌లు ఆడిన తర్వాత జితేష్ శర్మను జట్టు నుంచి తొలగించారు. రెండవ వికెట్ కీపర్‌గా ఇటీవల దేశవాలీలో ఝార్ఖండ్ జట్టును విజేతగా నిలిపిన ఇషాన్ కిషన్‌కు జట్టులో స్థానం లభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

