రేపటితో ముగియనున్న..టేబుల్ టెన్నిస్‌ నేషనల్‌ ర్యాంకింగ్ ఈవెంట్‌

రేపటితో ముగియనున్న..టేబుల్ టెన్నిస్‌ నేషనల్‌ ర్యాంకింగ్ ఈవెంట్‌
X
టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొయినాబాద్ ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్‌లో పోటీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో టేబుల్ టెన్నిస్‌ నేషనల్‌ ర్యాంకింగ్ ఈవెంట్‌ విజయవంతంగా కొనసాగుతున్నాయి. జాతీయ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొయినాబాద్ ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్‌లో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలో దేశ వ్యాప్తంగా దాదాపు 1850 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ నెల 4న ప్రారంభం అయిన ఈ పోటీలు.. రేపటితో ముగియనున్నాయి. ఇక క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా జాతీయ ర్యాంకుల నిర్ధారించనున్నట్లు జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య కార్యదర్శి కమలేశ్ మెహతా తెలిపారు. అండర్‌ 11 నుంచి సీనియర్స్‌ వరకు మొత్తం 12 విభాగాల్లో క్రీడాకారుల మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఇక ఈవెంట్‌కు విశేష స్పందన వస్తుందని ఈవెంట్‌ నిర్వాహకులు విజయ్ కుమార్ తెలిపారు.

Tags

Next Story