పాక్-ఆఫ్గన్ క్రికెట్ సిరీస్.. ఓకే చెప్పిన తాలిబన్లు..!

Afghanistan Vs Pakistan: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి. దాంతో ఆదేశం భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. పాకిస్థాన్- ఆఫ్గనిస్థాన్ మధ్య శ్రీలంక వేదికగా క్రికెట్ టోర్నీ వచ్చే నెలలో జరగాల్సివుంది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్ వ్యతిరేకించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌కు తాలిబన్లు అంగీకారం తెలిపారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే సిరీస్ యధావిధిగా కొనసాగుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పేర్కొనడం సంచలనంగా మారింది.
అయితే తొలుత పాక్-ఆఫ్గన్ సిరీస్ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే, సిరీస్ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లబించింది. దాంతో క్రీడా ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది. కాగా, సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాక్, ఆఫ్గన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సివుంది. ఆఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్లేయర్లతో కీలక ఆటగాళ్లు 100సిరీస్ లో బీజీగా ఉన్నారు. రషీద్ ఖాన్, నబి వంటి ఆటగాళ్లు ప్రస్తుతం ఇతర దేశంలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com