TEAM INDIA: సెమీస్ చేరాలంటే వ్యూహాలు మారాల్సిందే

TEAM INDIA: సెమీస్ చేరాలంటే వ్యూహాలు మారాల్సిందే
X
సూపర్ 8లో వ్యూహాలు రీసెట్ కావాలి... సఫారీలతో మ్యాచ్ స్పష్టమైన సందేశం.. గంభీర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు

అహ్మ­దా­బా­ద్ వే­ది­క­గా జరి­గిన టీ20 వర­ల్డ్‌­క­ప్ 2026 సూ­ప­ర్‌ 8 మ్యా­చ్‌­లో టీ­మ్‌­ఇం­డి­యా ఎదు­ర్కొ­న్న ఘోర పరా­జ­యం కే­వ­లం ఓ ఓట­మి­గా­నే కా­కుం­డా జట్టు ఎం­పి­క­పై పె­ద్ద చర్చ­కు దా­రి­తీ­సిం­ది. వరు­స­గా నా­లు­గు వి­జ­యా­ల­తో గ్రూ­ప్‌ దశను దా­టిన భారత జట్టు, దక్షి­ణా­ఫ్రి­కా­తో జరి­గిన కీలక మ్యా­చ్‌­లో 76 పరు­గుల తే­డా­తో ఓడి­పో­వ­డం అభి­మా­ను­ల­ను ని­రా­శ­కు గు­రి­చే­సిం­ది. అయి­తే ఈ మ్యా­చ్‌­లో జరి­గిన ఒక ని­ర్ణ­యం వైస్ కె­ప్టె­న్ అక్ష­ర్ పటే­ల్‌­ను తప్పిం­చి వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్‌­ను తు­ది­జ­ట్టు­లో­కి తీ­సు­కో­వ­డం ఇప్పు­డం­తా చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. మూడు మ్యా­చ్‌­లు ఆడి 6 వి­కె­ట్లు తీ­సిన అక్ష­ర్ పటే­ల్ సగటు 12.16, ఎకా­న­మీ 6.63. ఇలాం­టి గణాం­కా­లు నమో­దు చే­సిన బౌ­ల­ర్‌­ను కీలక మ్యా­చ్‌­లో బయ­ట­పె­ట్ట­డం ఆశ్చ­ర్య­మే. గ్రూ­ప్‌ దశలో అతను సూ­ప­ర్‌ ఫా­మ్‌­లో కని­పిం­చా­డు. ము­ఖ్యం­గా పా­కి­స్థా­న్‌­తో జరి­గిన పో­రు­లో 2/29 గణాం­కా­ల­తో మ్యా­చ్‌­ను మలు­పు­తి­ప్పా­డు. ఎడ­మ­చే­తి స్పి­న్న­ర్‌­గా జట్టు­కు వై­వి­ధ్యం తీ­సు­కొ­చ్చే అతను, బ్యా­టిం­గ్‌­లో­నూ వి­లు­వైన పరు­గు­లు చే­య­గల సా­మ­ర్థ్యం ఉన్న ఆల్‌­రౌం­డ­ర్. అహ్మ­దా­బా­ద్ అతని సొంత నగరం కా­వ­డం, నరేం­ద్ర మోదీ స్టే­డి­యం­లో మంచి రి­కా­ర్డు ఉం­డ­డం కూడా అత­ని­కి అను­కూల అం­శా­లే.

అయి­తే జట్టు యా­జ­మా­న్యం అక్ష­ర్‌­ను తప్పిం­చి ఇటీ­వల అం­త­గా మ్యా­చ్‌­లు ఆడని వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్‌­ను ఎం­పిక చే­సిం­ది. గా­య­మే­మై­నా ఉం­దే­మో అన్న అను­మా­నా­లు వచ్చి­నా, అది కా­కుం­డా వ్యూ­హా­త్మక ని­ర్ణ­యం­గా తీ­సు­కు­న్న­ట్టు స్ప­ష్ట­మైం­ది. కానీ మ్యా­చ్‌­లో సుం­ద­ర్‌­తో కే­వ­లం రెం­డు ఓవ­ర్లు మా­త్ర­మే బౌ­లిం­గ్ చే­యిం­చ­డం, అతను 17 పరు­గు­లు ఇచ్చి వి­కె­ట్ తీ­య­క­పో­వ­డం ఈ ని­ర్ణ­యం­పై మరింత ప్ర­శ్న­లు లే­వ­నె­త్తిం­ది. బ్యా­టిం­గ్‌­లో­నూ అయి­దో స్థా­నం­లో వచ్చిన సుం­ద­ర్ 11 పరు­గు­ల­కే పరి­మి­త­మ­య్యా­డు. అత­డి­ని అంత ఎత్తు­లో ఆడిం­చ­డం వ్యూ­హా­త్మక తప్పి­దం­గా కని­పిం­చిం­ది. ఈ ని­ర్ణ­యం­పై మాజీ క్రి­కె­ట­ర్ రవి­చం­ద్ర­న్ అశ్వి­న్ కూడా తన అసం­తృ­ప్తి­ని వ్య­క్తం చే­శా­డు. తన యూ­ట్యూ­బ్ ఛా­న­ల్‌­లో మా­ట్లా­డు­తూ ఐసీ­సీ టో­ర్న­మెం­ట్ల­లో జట్టు స్థి­ర­త్వం అత్యంత కీ­ల­క­మ­ని పే­ర్కొ­న్నా­డు. ఐపీ­ఎ­ల్ లాం­టి దీ­ర్ఘ టో­ర్న­మెం­ట్ల­లో మా­ర్పు­లు సహ­జ­మ­ని, కానీ ప్ర­పం­చ­క­ప్‌­లాం­టి ప్ర­ధాన టో­ర్నీ­ల్లో స్థి­ర­మైన కాం­బి­నే­ష­న్‌­ను కొ­న­సా­గిం­చా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని వి­వ­రిం­చా­డు. ఎడ­మ­చే­తి బ్యా­ట­ర్ల­ను ఎదు­ర్కొ­నేం­దు­కు సుం­ద­ర్‌­ను ఎం­పిక చే­య­డా­న్ని తాను పూ­ర్తి­గా వ్య­తి­రే­కిం­చ­డం లే­ద­ని చె­ప్పి­నా, టీ20 ఫా­ర్మా­ట్‌­లో అక్ష­ర్ పటే­ల్ ఎంత ము­ఖ్య­మైన ఆట­గా­డో గు­ర్తు­చే­శా­డు.

అశ్వి­న్ మరో ము­ఖ్య అం­శా­న్ని కూడా ప్ర­స్తా­విం­చా­డు. గత టీ20 ప్ర­పం­చ­క­ప్ 2024 ఫై­న­ల్లో అక్ష­ర్ పటే­ల్ చే­సిన ప్ర­ద­ర్శ­న­ను గు­ర్తు చే­శా­డు. ఆ మ్యా­చ్‌­లో దక్షి­ణా­ఫ్రి­కా­పై క్లి­ష్ట పరి­స్థి­తు­ల్లో క్రీ­జు­లో­కి వచ్చిన అక్ష­ర్, వి­రా­ట్ కో­హ్లీ­తో కలి­సి 72 పరు­గుల కీలక భా­గ­స్వా­మ్యం నె­ల­కొ­ల్పి జట్టు­ను 170 పరు­గుల మా­ర్క్ దా­టే­లా చే­శా­డ­ని పే­ర్కొ­న్నా­డు. అలాం­టి మ్యా­చ్-వి­న్నిం­గ్ సా­మ­ర్థ్యం ఉన్న ఆట­గా­డి­ని కీలక సమ­యం­లో పక్కన పె­ట్ట­డం సరైన ని­ర్ణ­యం కా­ద­ని అభి­ప్రా­య­ప­డ్డా­డు. ఇదే కా­కుం­డా రిం­కు సిం­గ్‌­ను నం­బ­ర్ 8లో బ్యా­టిం­గ్‌­కు పం­ప­డా­న్ని కూడా అశ్వి­న్ తప్పు­బ­ట్టా­డు. జట్టు­లో ఇప్ప­టి­కే ఎని­మి­ది మంది బ్యా­ట­ర్లు ఉన్న­ప్ప­టి­కీ అత­డి­ని అంత ది­గు­వన ఆడిం­చ­డం అర్థం కాని వ్యూ­హ­మ­ని పే­ర్కొ­న్నా­డు. సుం­ద­ర్‌­ను అగౌ­ర­వ­ప­ర­చా­ల­నే ఉద్దే­శం లే­ద­ని స్ప­ష్టం చే­సి­నా, సరైన సన్న­ద్ధత లే­కుం­డా కీలక మ్యా­చ్‌­ల­కు రా­వొ­ద్ద­ని సూ­చిం­చా­డు. ఈ ఓటమి గు­ణ­పా­ఠం­గా మా­రా­ల­ని అభి­ప్రా­య­ప­డ్డా­డు.

Tags

Next Story