చిక్కుల్లో టీమిండియా క్రికెటర్..రాజ్‌కుంద్రా-రహానే మధ్య ట్వీట్స్ వైరల్
Ajinkya Rahane and Raj Kundra
Ajinkya Rahane and Raj Kundra Tweets: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఫోర్నోగ్రఫీకి కేసులో జులై 20న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కుంద్రా పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ముంబై పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రాజ్‌కుంద్రా భారత క్రికెటర్ అజింక్యా రహానేను చిక్కుల్లోకి నెట్టేలా ఉంది. దీనికి కారణం రాజ్‌కుంద్రా-రహానే మధ్య జరిగిన ట్వీట్ వ్యవహారమే. దాదాపు తొమ్మిది ఏళ్ల కిత్రం 2012లో రహానే ఐపీఎల్ ఫ్రాచైజీల్లో ఒకటైనా రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిద్యం వహించాడు. అప్పుడు రాజ్ కుంద్రాను మెచ్చుకుంటూ రహానే చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.
ఈ ట్వీట్ లో సారంసం ఏమిటంటే.. ''రాజ్ కుంద్రా మీరు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు.. ఇలాగే కొనసాగించండి.'' అంటూ రహానే పేర్కొన్నాడు. అప్పటికి దీనికి రాజ్ కుంద్రా బదులిచ్చాడు. '' థ్యాంక్యూ సో మచ్ రహానే.. నేను చేసే పనిని నువ్వు కచ్చితంగా లైవ్‌లో చూడాలి'' అంటూ కామెంట్ చేశాడు. దానికి రహానే కూడా.. '' తప్పకుండా వస్తాను సార్'' అంటూ రిప్లై ఇచ్చాడు. 2012లో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి రాజ్ కుంద్రా సహ యజమానిగా ఉన్నాడు. 2013లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2015లో రాజస్తాన్ రాయల్స్‌తో పాటు క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు.
ప్రస్తుతం రహానే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రహానే, రాజ్‌కుంద్రాల మధ్య ట్వీట్స్ దేని గురించి అనేది సరైన సమాచారం లేదు. అయితే ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో వీరి మధ్య ఎలాంటి చర్చ జరిగి ఉంటుందనే అంశంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు మాత్రం రహానే ట్వీ్ట్ కాదని, మేము పూర్తిగా నమ్మలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రహానే ఆన్సర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com