T20 World Cup: అఫ్గానిస్థాన్‌పై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు

Gautam Gambhir: యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది. టోర్నమెంట్ తొలి రౌండ్ అక్టోబరు 17న ఒమన్‌లో ఆరంభమవుతుంది.అక్టోబర్ 24న భారత్ తొలి మ్యాచ్ దాయదీ పాకిస్థాన్ తో తలపడనుంది. అబుదాబి వేదికగా అక్టోబరు 31న మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. అనంతరం నవంబరు 3న అఫ్గానిస్థాన్‌తో ఆడుతుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్ కూడా విజేతగా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అఫ్గాన్ జట్టులో కూడా మ్యాచ్ గెలిపించగల ప్లేయర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. టీ20ల్లో ఆ జట్టు అద్భుతంగా రాణిస్తుందన్న గంభీర్.. రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లున్నారని, మ్యాచ్ గమనాన్నే మార్చేస్తారని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్‌లో దాయదీపై భారత్‌దే పై చేయి అవుతుందన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచులోనే తలపడటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని కూడా ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. 2007లో తొలి టీ20 తొలి మ్యాచ్ స్కాట్లాండ్‌తో జరగాలి. వర్షంతో అది కుదర్లేదు. ప్రాక్టికల్‌గా తొలి మ్యాచ్ ఆడింది మాత్రం పాకిస్థాన్‌తోనే అని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్, ఇంగ్లండ్ చాలా పటిష్టంగా ఉన్నాయి..పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ జట్టు నిలకడగా రాణిస్తున్నాయిని గంభీర్ అన్నాడు.
ఇక పొట్టి ఫార్మాట్ లో ఆస్ట్రేలియా టీం లయ తప్పినట్లు కనిపిస్తుంది. గతంలో కంటే భిన్నంగా వారు ఆడతున్నారు. సీనియర్లు లేకుండా బంగ్లా పర్యటించిన ఆసీస్ పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. భారత్ సూపర్-12 మ్యాచ్‌లను క్వాలిఫయింగ్ గ్రూప్-బి విజేత (నవంబరు 5)తో, గ్రూప్-ఎ రన్నరప్ (నవంబరు 8)తో ఆడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com