భీమ్లా నాయక్‌పై టీమిండియా క్రికెటర్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. తాజాగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్, రానా హీరోలుగా ఓ మూవీ రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నాడు. అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ ఈ చిత్రం. అందులో పవన్ భీమ్లా నాయక్‌గా కనిపిస్తున్నాడు. కరోనా కారణంగా కొన్ని రోజులు పాటు చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ సెట్‌లో అడుగు పెట్టారు పవన్, రానా. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో వైరల్ అవుతోంది.
టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి పవన్ కళ్యాణ్ అభిమాని అనే సంగతి తెలిసిందే. గతంలో హనుమ విహారి పవన్ కల్యాణ్‌ను కలిసి ఫొటోలు తీసుకున్నాడు. హనుమ విహారిని ఇంగ్లాండ్‌లో ఉన్నా.. పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన వీడియో షేర్ అయిన వెంటనే.. BheemlaNayak, PawanKayan, PSPK Rana అనే పేర్లను మెన్షన్ చేస్తూ ఓ ట్వీట్ వదిలాడు. భీమ్లా నాయక్ ఆన్ ఫైర్ అనే మెసేజీని పంపించాడు. వకీల్ సాబ్ సినిమాతో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. వకీల్ సాబ్ సినిమా తర్వాత వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
#BheemlaNayak 🔥@PawanKalyan #PSPKRana
— Hanuma vihari (@Hanumavihari) July 27, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com